Home దునియా 2000 సంవత్సరాల కిందటి వరద రాజ పెరుమాళ్ ఆలయం

2000 సంవత్సరాల కిందటి వరద రాజ పెరుమాళ్ ఆలయం

Varadharaja-Perumal-Temple

క్రీ.శ 1053 సంవత్సరంలో పల్లవుల రాజు ‘నంది రాజవర్మన్’ స్థాపించిన మొట్ట మొదటి గుడి విష్ణు కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం. తరువాత కాలంలో చోళుల “కుళోత్తుంగ” రాజు విక్రయ చోళులు దీనిని విస్తరించారు. 14వ శతాబ్దంలో చోళుల ద్వారా గోపురం నిర్మించబడినది. మొగలుల కాలంలో వారి దాడికి భయపడి ప్రధాన విగ్రహాన్ని ‘ఉదయార్ పాలయం’ ప్రస్తుత ‘తిరుచిరాపల్లి’ జిల్లాకు తరలించారు. తర్వాత ఆధ్యాత్మిక గురువైన ‘తిడరమల్’ అధ్వర్యంలో అతికష్టం మీద తిరిగి ప్రధాన విగ్రహాన్ని విష్ణుకంచికి తరలించారు. క్రీ.శ1532 సం॥ నాటి శాసనాల ద్వారా లభించిన సమాచారం ప్రకారం ‘వీర నరసింగరాయసాళువ నాయక్’ శాసించగా అచ్యుత రాయులు కొన్ని గ్రామాలను గుడికి ధారాదత్తం చేశారు.

నిజానికి వీరనరసింగరాయలు ఏకాంబరేశ్వరనాధ’ గుడికి విరాళాలు ఇవ్వమని శాసించగా అచత రాయులు తన సొంత నిర్ణయంతో రెండు భాగాలుగా విడదీసి ‘వరదరాజు పెరుమాళ్’ గుడి కూడా సమానంగా పంచారని ప్రతీతి. 13వ శతాబ్ధంలో వయసాలులు పెరుమాళ్‌కు ఒక బంగారు కిరీటాన్ని బహుకరించిన ఇప్పటికీ ధరిస్తుంటారని చెబుతారు. 15వ శతాబ్దంలో మొగలుల ఆఖరు రాజైన జౌరంగజేబు దాడి చేస్తారని సమాచారం. సంవత్సరంలో తిరిగి తీసుకొచ్చారు. అయినప్పటికీ అప్పటి ఉదయారు పాలయం సేనాధిపతి అభ్యంతరం చెప్పగా ‘పరివ్రాజకాచార్య’ జియర్ కల్పించుకొని తిరిగి స్థాపించారని తెలుస్తున్నది.

మొత్తం గుడి 23 ఎకరాల విస్తీరంలో (93.000 మీ) విశ్వకర్మ స్థపతుల అధ్వర్యంలో నిర్మించారు. ఈ గుడికి మొత్తం 3 ప్రాకారాలు. అజ్వర్ ప్రాకారం, మదైప్రాకారం, తిరువులై ప్రాకారం అంతర్భాగంలో 32 క్షేత్రాలు 19 విమానాలు, 389 స్తంభాలు గల హాలు. (వాటిలో ఎక్కువ భాగం సింహం ఆకారంలో నిర్మించినవి) వెలుపల వైపు ఒక కోనేరు గుండ నిర్మాణం చేశారు. ప్రధాన గోపురం 130 అడుగులు పొడుగు, 7 అంతస్తులతో విరజిల్లుతున్నది. తూర్పు గోపురం, పడమటి గోపురం కంటే పొడవు కలిగి ఎత్తుగా గాలిగోపురంలా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆకర్షించేది ఏమనగా ఎక్కువ శాతం ఏకశిలపై చెక్కి ఏకశిలలతోనే నిర్మించారు.

వంద స్తంభాల హాలులో ముఖ్యంగా రామాయణ, మహాభారత, విజయనగర విగ్రహాలు చెక్కబడి వున్నవి. సీలింగ్ పై గుండా విజయనగర విగ్రహాలు చెక్కబడి వుండటం విశేషం.ప్రధాన విశేషం ఏమనగా ఒక చిన్న వెండి పెట్టెలో వరదరాజస్వామి చెక్క విగ్రహాన్ని వుంచి 40 సంవత్సరాలకొకసారి అందులోకి నీటిని వదులుతారు. తిరిగి నీళ్లల్లో ఆ వెండి పేటికను కలుపుతారు. అందుకుగాను ఆ కోనేరు ఎప్పుడు నీటిలో కళకళ లాడుతుందని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం వున్న విగ్రహం అసాధారణంగా 10 అడుగుల పొడవుతో గ్రానైట్‌తో తయారు చేయబడి నిలుచున్న భంగిమలో వుంటుంది. అమ్మగారి విగ్రహం మాత్రం నాలుగు అడుగులతో కూర్చున్న భంగిమతో వుంటుంది.

కిందివైపు నాలుగు చిన్న క్షేత్రాలుగా మలయాళ కాచియర్ (కేరళరాబాలు) 14వ శతాబ్దంలో స్థాపించారు. తూర్పువైపు వున్న కోనేటిని ‘చక్రతాళ్‌వార్ గా పిలుస్తారు. ఈ గుడికి కేవలం తూర్పు, పడమర రెండు గోపురాలు. ఒకటి 180 అడుగులు. మరొకటి 160 అడుగులతో నిర్మించడం విశేషం. బ్రిటిష్ వారి కాలంలో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాబర్డ్ క్లైవ్ గరుడసేవ ఉత్సవానికి విచ్చేసి ఒక బంగారు నెక్లెస్‌ను బహుకరించారు. ఇప్పటికి ప్రత్యేక పర్వదినాలలో ఆ నెక్లెస్‌ను అలంకరిస్తుంటారు. 18వ శతాబ్దంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు ఈ గుడిలోనే రాగాలు కట్టారని కూడా చెబుతారు. తమిళనాడులోని కాంచీపురంలో వూరికి ఒక వైపు శివకంచి , మరోవైపు విష్ణుకంచి ఊరిమధ్యలో కామాక్షి అమ్మవారి గుడి నిర్మించారు. ఆవిష్ణు కంచిలో నిర్మించినదే ఈ వరదరాజు పెరుమాళ్ గుడి.

-రఘకుమార్, 9441241915