Search
Sunday 18 November 2018
  • :
  • :

వరవరరావు హౌస్ అరెస్టు

Varavara Rao House Arrested in Hyderabad

హైదరాబాద్ : పౌర హక్కుల నేత వరవరరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప్రధాని మోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని, ఈ కుట్రలో వరవరరావు కూడా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని వరవరరావు, ఆయన కూతురు ఇంట్లో పుణె పోలీసులు సోదాలు చేశారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసి పుణెకు తరలించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఐదుగురిని అరెస్టు చేశారు. పౌర హక్కుల నేతల అరెస్టులు సమంజసం కాదని, వారిని హౌస్ అరెస్టు మాత్రమే చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో వరవరరావును హైదరాబాద్‌కు తరలించి హౌస్ అరెస్టు చేశారు.

Varavara Rao House Arrested in Hyderabad

Comments

comments