Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

‘మహా’ పోలీసులు చెప్పింది పాత కథే

మావోయిస్టులతో సంబంధాల ఉత్తరాలు పోలీసుల సృష్టి: బంధువులు

Police Checks in Virasam Leader Varavara Rao Home

మనతెలంగాణ/హైదరాబాద్ : విరసం నేత వరవరరావు అరెస్టుకు ఆధారంగా చూపుతున్న ఉత్తరం పోలీసులు సృష్టించినదేనని ఆయన అల్లుడు, జర్నలిస్టు వేణుగోపాల్ అన్నారు. పోలీసుల ఆరోపణల్లో కొత్త విషయాలు ఏవీ లేవని, ఇవన్నీ జూన్‌లో పోలీసులు ఆరోపించినవేనని ఆయన తెలిపారు. హక్కుల నేతల అరెస్ట్‌కు సాక్ష్యాలను సెప్టెంబర్ 6న కోర్టులో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, కోర్టులో ఆధారాలు దాఖలు చేయకముందు మీడియాలో వెల్లడించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఆయన అన్నారు. విచారణ అనేది కోర్టు పరిధిలోనిదని, దీనిని పోలీసులు ఉల్లంఘించారని తెలిపారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి పోలీసు అధికారికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు చూపుతున్న సాక్షం తప్పుడుదని, అరెస్ట్ చేసినవారిని అప్రతిష్టపాలు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని వేణుగోపాల్ అన్నారు. హక్కుల నేతల అరెస్ట్‌కు దారి తీసిన సాక్ష్యాలను కోర్టుకి సమర్పించమని సుప్రీం ఆదేశించిందని, మీడియాకు కాదని ఆయన తెలిపారు. సాక్ష్యాలను ప్రవేశపెట్టడానికి పోలీసులకు అపెక్స్ కోర్టు వారం రోజుల సమయంఇచ్చిందని, కోర్టులో సమర్పించకుండా మీడియాకు వెల్లడించారని, ఇది మీడియా విచారణ అని, దీనిని పోలీసులు నిర్వహించారని ఆయన అన్నారు. పోలీసుల సాక్ష్యాలు తప్పా ఒప్పా అనేది తాను ప్రశ్నించడం లేదని, ఇవి సాక్ష్యాలు కావని, కల్పితాలని వేణుగోపాల్ తెలిపారు.జూన్‌లో జరిగిన అరెస్టులకు చూపిన సాక్ష్యాలు కల్పితాలని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన జూన్‌లోనే ప్రకటించాయని గుర్తు చేశారు.
ఆరోపణలు కల్పితాలు : వెర్నాన్ బంధువులు
హక్కుల నేతలపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితాలని పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఒకరైన పౌర హక్కుల నేత వెర్నాన్ గోన్‌సాల్వేస్ బంధువులు అన్నారు. ఆగస్ట్ 28న పుణె పోలీసులు అరెస్ట్ చేసిన గోన్‌సాల్వేస్‌పై మోపిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని గోన్‌సాల్వేస్ కొడుకు సాగర్ గోన్‌సాల్వేస్ చెప్పారు. పోలీసులు తమ ఇంట్లో సోదా చేస్తున్నప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని, పోలీసులు తమ ఇంటి నుంచి ఏమి స్వాధీనం చేసుకున్నారో తనకు తెలుసని ఆయన చెప్పారు. పోలీసులు గాలి మాటలు చెప్తున్నారని, పోలీసులు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు చేసిన తప్పుడు ఆరోపణలకు తాను నవ్వానని ఆయన అన్నారు. కోరెగాం భీమా అల్లర్లకు కారకులైన అసలైన నిందితుల నుంచి దృష్టి మరల్చడానికే పోలీసులు ప్రయత్నించారని గోన్‌సాల్వేస్ భార్య, లాయర్ సూసాన్ అబ్రహం అన్నారు. మీడియా సమావేశంలో చదివిన ఉత్తరం పోలీసులు తయారు చేసినదేనని ఆమె చెప్పారు. దర్యాప్తులో పోలీసులు చట్టప్రకారం నడుచుకోవడం లేదని ఆమె అన్నారు.
పోలీసులు కుట్రపన్నారు : హక్కుల నేత సుధా భరద్వాజ్

పోలీసులు చేసిన ఆరోపణలన్నీ కుట్రపూరితమైనవని ఐదుగురు హక్కుల నేతలతో పాటు అరెస్టయిన సుధా భరద్వాజ్ అన్నారు. మహారాష్ట్ర పోలీసులు తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆమె చెప్పారు. సాక్షంగా మీడియా ముందు పోలీసులు చూపిన ఉత్తరం పూర్తిగా కల్పితమని ఆమె తెలిపారు. తాము నిర్వహించే సమావేశాలు, సెమినార్లు, నిరసనలకు మావోయిస్టులు నిధులు సమకూర్చుతున్నారని పోలీసులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సుధా అన్నారు. తనని నేరస్తురాలిగా చూపడానికి పోలీసులు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె చెప్పారు. ఈ ఉత్తరం పుణె కోర్టుకుగాని, ఫరీదాబాద్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకుగాని చూపించలేదని ఆమె స్పష్టం చేశారు.

Comments

comments