Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఇచ్చంత్రం గాకపోతేమరేంటి…!

ఇచ్చంత్రం గాకపోతేమరేంటి…!

Weddingఅమరావతి: విచిత్రానికే విచిత్రం అనిపించే వార్త ఇది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఓ విచిత్ర పెళ్లి తంతు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఎపిలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవులో వివాహ వేడుకలో ఓ వింత ఆచారం ఆ పెళ్లికి హాజరైన అతిథులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకు అక్కడ జరిగిందెంటో తెలుసా? పెళ్లి కుమారుడికి పెళ్లి కూతురు తాళి కట్టడం. అవును మీరు విన్నది నిజమే. ఇదే జరిగింది ఆ వివాహ వేడుకలో. ఎక్కడైనా పెళ్లికూతురు మెడలో పెళ్లికొడుకు తాళి కట్టడంతో వివాహ వేడుక ముగుస్తుంది. కానీ ఈ గ్రామంలో మాత్రం పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురు తాళి కడుతుంది. ఈ గ్రామంలో రెండేళ్లకు ఒకసారి మాత్రమే వివాహాలు జరుపుతుండగా ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామస్తులు ఇప్పటికీ కొనసాగిస్తుండడం గమనార్హం. ఈ వింత ఆచారం ఇచ్చంత్రం గాకపోతేమరేంటి అనిపిస్తోంది కదూ.

Variety Wedding Tradition in Andhra Pradesh