Home సినిమా ప్రయోగాల బాటలో…

ప్రయోగాల బాటలో…

vrn

మెగా ఫ్యామిలీ నుండి వచ్చి తొలి సినిమా నుండి డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ విలక్షణ హీరోగా పేరుతెచ్చుకున్నాడు వరుణ్‌తేజ్. ఇప్పుడు అతను లవ్‌స్టోరీలతో వరుస హిట్స్ అందుకుంటున్నాడు. వరుసగా ఫిదా, తొలిప్రేమ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ తరుణంలో వరుణ్ తదుపరి చిత్రం కోసం మళ్లీ ప్రయోగాల బాట పడుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ‘తొలిప్రేమ’తో ఘన విజయాన్ని అందుకున్న అతను తర్వాత యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. రానాతో ‘ఘాజీ’ అనే ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడే ఈ సంకల్ప్‌రెడ్డి. ఇప్పుడు వరుణ్‌తేజ్ కోసం ఓ అదిరిపోయే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. ఈ సినిమాలో వరుణ్ ఆస్ట్రోనాట్‌గా నటించనున్నాడు. జలాంతర్గమి నేపథ్యంలో ‘ఘాజీ’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాడు సంకల్ప్‌రెడ్డి. ఇప్పుడు వరుణ్‌తో స్పేస్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
అంటే ఇది కూడా ఖచ్చితంగా ప్రయోగాత్మక చిత్రమే. దీంతో వరుణ్ లవర్‌బాయ్ నుండి మళ్లీ ప్రయోగాల బాట పట్టనున్నాడు. ఏది ఏమైనా ఈ యంగ్ హీరో ఒకే ట్రాక్‌లో సినిమాలు చేయకుండా తన ట్రాక్‌ను మార్చుకుంటూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ఈరకంగా వరుణ్‌తేజ్ మెగా ఫ్యామిలీలో పూర్తి కమర్షియల్ హీరో అనే ఇమేజ్ కాకుండా విలక్షణ నటుడు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మెగా అభిమానులకు ఇది సంతోషించదగ్గ విషయమే.