Home వార్తలు వరుణ్, వితికల నిశ్చితార్థం

వరుణ్, వితికల నిశ్చితార్థం

varun‘హ్యాపీడేస్’ సినిమాతో 2007లో తెలుగు తెరకు పరిచయమయ్యాడు వరుణ్‌సందేశ్. ఆతర్వాత పలు సినిమాలతో విజయాలను అందుకున్న అతను ఇటీవల సరైన హిట్ లేకపోవడంతో డీలాపడ్డాడు. ఇక వరుణ్‌సందేశ్ త్వరలోనే పెళ్లికి సిద్ధమవు తున్నాడని సమాచారం. అది కూడా తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లిచేసుకో బోతున్నాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో హర్షవర్ధన్ రాణేకి జోడీగా కనిపించిన వితిక షేరుని వరుణ్‌సందేశ్  పెళ్లి చేసుకోనున్నాడు. వీరిద్దరి కాంబినే షన్‌లో ‘పడ్డానండి ప్రేమ’లో సినిమా వచ్చింది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు చేశారు. వరుణ్‌సందేశ్-వితిక షేరుల నిశ్చితార్థ వేడుక డిసెంబర్ 7న జూబ్లీహిల్స్ క్లబ్‌లో జరుగనుంది.