Home సినిమా హాలీవుడ్ స్టంట్స్

హాలీవుడ్ స్టంట్స్

varun

యంగ్ హీరో వరుణ్‌తేజ్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీ హీరో యిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో అబ్బురపరిచే హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. అందుకోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్, రోమన్ పనిచేస్తున్నారు. గతంలో వీరు ఎక్స్‌పాండబుల్-2, ట్రాయ్, జీరో డార్క్ థట్టి,హెర్కులెస్, గేమ్ ఆఫ్ త్రోన్స్ తదితర సినిమాలకు వర్క్ చేశారు. ఈ సినిమా కోసం వరుణ్, అదితిలపై 3డి స్కాన్ చేయడం జరిగింది. సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటర్‌ః కార్తీక శ్రీనివాస్, సంగీతంః ప్రశాంత్ ఆర్.విహారీ, డైలాగ్స్‌ః కిట్టు విస్సాప్రగడ, విఎఫ్‌ఎక్స్‌ః మైష్ త్యాగి.