Home తాజా వార్తలు ‘వాల్మీకి’ లుక్ అదిరింది..

‘వాల్మీకి’ లుక్ అదిరింది..

 

హైదరాబాద్‌: మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ ఎఫ్ 2 సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘వాల్మీకి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిందే.14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.కాగా,  గురువారం నుంచి ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. వరుణ్ తేజ్ పై హరీశ్ శంకర్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లోని తన లుక్‌ను అభిమానుల కోసం పంచుకుంటూ ‘సరికొత్త బాటలో వాల్మీకి’ అని వరుణ్ తేజ్ ట్వీట్‌ చేశారు. గుబురు గడ్డం, చెవి పోగుతో ఉన్న వరుణ్ మాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. హరీశ్‌ శంకర్‌ కూడా ఈ సినిమా గురించి ట్వీట్‌ చేస్తూ, ‘వాల్మీకి స్వాగతం.. తొలి రోజు షూటింగ్‌ అద్భుతంగా జరిగింది. ఇది ఇలాగే సాగాలని ఎదురుచూస్తున్నా. మండు వేసవిలో కష్టపడుతున్న సినిమాటోగ్రాఫర్‌ అయాంక్‌ బోస్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Varun Tej Valmiki movie shoot begins