Home తాజా వార్తలు ‘కవచం’ నుండి ‘వ‌స్తావా పిల్లా’… (వీడియో సాంగ్)

‘కవచం’ నుండి ‘వ‌స్తావా పిల్లా’… (వీడియో సాంగ్)

Vasthava Pillaa Video Songహైదరాబాద్: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కవచం’. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్, టీజర్, ఆడియో అభిమానులను అలరిస్తుండగా… తాజాగా ‘వ‌స్తావా పిల్లా’ అంటూ సాగే సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బ్యూటీఫుల్ లోకేషన్స్ లో చాలా రీచ్ గా పాటను చిత్రీకరించారు. పాటలో మెహ్రీన్, శ్రీనివాస్ జంట చాలా అందంగా కనిపిస్తోంది. శ్రీనివాస్‌ దర్శకత్వంలో వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ సొంటినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. “రెగ్యులర్ ఫిలింలా కాకుండా కొత్త జోనర్‌లో చాలా కొత్తగా ఈ చిత్రం ఉంటుందని చిత్ర దర్శకుడు శ్రీనివాస్ చెప్పారు. యంగ్ తరంగ్ థమన్ వినసొంపైన బాణీలు అందించారు.