Home జాతీయ వార్తలు శరద్ యాదవ్ నన్ను అవమానించారు: వసుంధర

శరద్ యాదవ్ నన్ను అవమానించారు: వసుంధర

Vasundhara Rajeజైపూర్: జెడి(యు) మాజీ నేత శరద్ యాదవ్ తనను స్థూలకాయురాలిగా వర్ణించడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె మండిపడ్డారు. ఇది తనను అవమానించడమేనని ఆమె చెప్పారు. శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఝల్రాపతన్ నియోజకవర్గంలోని ఝలావర్‌కు చెందిన ఒక పోలింగ్ కేంద్రంలో తన వోటు హక్కు వినియోగించుకున్న రాజె విలేకరులతో మాటాడుతూ ఈ వ్యాఖ్యలు తనను మాత్రమే కాక యావత్ మహిళా లోకాన్నే అవమానించినట్లని చెప్పారు. మేము ఏ నాయకుడి పట్ల వ్యక్తిగత వ్యాఖ్యలు చేయబోము..అది నాగరికం కూడా కాదు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఈ విధమైన భాష పట్ల ఎన్నికల సంఘ కఠనంగా వ్యవహరించాలి, అని యాదవ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజె అన్నారు.

రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో శరద్ యాదవ్ ప్రసంగిస్తూ, వసుంధరకూ కొంత విశ్రాంతి ఇవ్వండి..చాలా అలసిపోయింది. చాలా లావై పోయింది..బాగా అలసి పోతోంది..మొదట్లో బాగా సన్నగా ఉండేది..మా మధ్యప్రదేశ్ ఆడపడుచు ఆమె, అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బిజెపి గురువారం ఖండించడమే కాక యాదవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఇసికి ఫిర్యాదు చేసింది.
Yadav insulted me calling fat, says Vasundhara, Vasundhara condemns Sharad Yadavs Comments