Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

వటపత్ర సాయిగా యాదగిరీశుడు

god*కొనసాగుతున్న శ్రీలక్ష్మీ నరసింహుడి అధ్యయనోత్సవాలు
*అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

యాదగిరి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ క్షేత్రంలో స్వామి వారి అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శ్రీవారి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు వటపత్ర సాయి, వైకుంఠనాథ అలంకార సేవలో భక్తులకు స్వామి వారు దర్శనం ఇచ్చా రు. మంగళవారం రోజున ఉదయం బాలాలయంలో నిత్య పూజ కైంకర్యాలతో శ్రీ స్వామి అమ్మవార్ల కు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మనతెలంగాణ/యాదాద్రి: యాదగిరి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ క్షేత్రంలో స్వామి వారి అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శ్రీవారి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు వటపత్ర సాయి, వైకుంఠనాధ అలంకార సేవలో భక్తులకు స్వామి వారు దర్శనం ఇచ్చా రు. మంగళవారం రోజున ఉదయం బాలాలయం లో నిత్య పూజ కైంకర్యాలతో శ్రీ స్వామి అమ్మవార్ల కు ప్రత్యేక పూజలను నిర్వహించి పారాయణకిలచే దివ్య ప్రభంద పారాయణలను గావించాడు. శ్రీ స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించగా స్వామి వారిని వటపత్ర సాయి అలంకారుడిగా అలంకరించారు. లోక రక్షణకై అన్ని తానై ఉంటానని చూపేందుకే వటపత్ర సాయి అవతారంలో స్వామి దర్శనం కలిగిందని ఆలయ అర్చ క స్వాములు అలంకార సేవ విశిష్టతను భక్తులకు తెలియచేశారు.
వైకుంఠ నాథ అలంకార సేవ
శ్రీ వారి ఆలయంలో సా యంకాలం స్వామి వారి కి ద్రావిడప్రభంద సేవ కాలంను అధ్యాపక స్వా ములచే నిర్వహించి అ నంతరం వైకుంఠ నాథుడిగా శ్రీ లక్ష్మీనరసింహుడిని అలంకరించి బాలాలయ ఆవరణలో మేళతాల మధ్య ఊరేగించారు. అ నంతరం ఆలయ అర్చక స్వాములు స్వామి వారి అలంకార సేవ విశిష్టతను భక్తకోటికి తెలియజేశా రు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ గీత, చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికార సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments