Home జాతీయ వార్తలు వైసిపి వంచన దీక్ష

వైసిపి వంచన దీక్ష

VCP Protest For AP Special Status in Visakhapatnam

విశాఖపట్నం : ఎపి ప్రజలను నయవంచనకు గురి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ వైసిపి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు సోమవారం ఉదయం వంచన దీక్ష చేపట్టారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డితో పాటు ఎంపిలు, ఆ పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరు ఆగదని వైసిపి నేతలు స్పష్టం చేశారు. ఎపి ప్రజల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వారు మండిపడ్డారు.

VCP Protest For AP Special Status in Visakhapatnam