Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

‘వీర భోగ వసంత రాయలు’ షూటింగ్ షురూ

Sudheer-Babu

నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవికె రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంద్రసేన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేని ఈ వినూత్న కథా చిత్రంలో శ్రియా శరణ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ప్రేమ కథా చిత్రం, భలే మంచి రోజు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌బాబు ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మొదటి రోజు షూటింగ్‌లో సుధీర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత అప్పారావు బెల్లన మాట్లాడుతూ “రోహిత్, శ్రీవిష్ణు మా సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. శ్రియా కథ విని వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు. అలాగే సుధీర్‌బాబు ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌లో సుధీర్‌బాబు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొనగా కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నాము. అతి త్వరలో నారా రోహిత్, శ్రీవిష్ణు, శ్రియా షూటింగ్‌లో పాల్గొంటారు”అని చెప్పారు. దర్శకుడు ఇంద్రసేన మాట్లాడుతూ “సమాజంలో జరిగే అకృత్యాలను టచ్ చేస్తూ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. నాన్ లీనియర్ క్రైం థ్రిల్లర్‌గా సినిమాను రూపొందిస్తాం”అని తెలిపారు. సత్యదేవ్, శశాంక్, చరిత్ మానస్, స్నేహిత్, శ్రీనివాసరెడ్డి, భద్రమ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః సతీష్ రఘునాథన్, కెమెరాః హిస్టిన్-శేఖర్, యాక్షన్‌ః కింగ్ సోలమన్.

Comments

comments