Home జయశంకర్ భూపాలపల్లి కూరగాయల ధరలకు రెక్కలు…

కూరగాయల ధరలకు రెక్కలు…

Vegetable

భూపాలపల్లి : రోజురోజుకు మండుతున్న ఎండలకు పోటీగా కూరగాయల ధరలు పెరిగి కొండెక్కాయి.ఈ పరిస్థితిని చూస్తే తెలుగు పాట గుర్తుకు చేసుకోక తప్పదు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్నా..అన్నట్టుగా పెరిగిపోతున్న ఎండలకు దిగుబడులు పడిపోవటంతో డిమాండ్‌కు సరిపడా దిగుమతి లేకపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలోచ్చాయి పెరిగిన ధరలతో సామాన్య ప్రజలకు చుక్కలు చూపుతున్నాయి.జూలై వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెపుతున్నాయి .
అడుగంటిన భూగర్భ జలాలు తగ్గిన సాగు…పెరిగిన ధరలు
జిల్లా కేంద్రంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి గడిచిన రెండు రోజుల్లో కిలో బీరకాయ రూ.50 రూ.పలికి ప్రస్తుతం కిలో రూ.100కు చేరింది.మొన్నటివరకు రూ.20 పలికిన టమాట ప్రస్తుతం రూ.60కి చేరింది, చిక్కుడుగాయ,మిర్చి గతంలో రూ.కిలో 50 ఉండేది అమాంతం (100)సెంచరి కొట్టింది. దీంతో సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది.రెక్కాడితే గాని డొక్కాడని ప్రజల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. కారంతో కడుపు నింపుకొని పస్తులుండ వలసిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. మిగిలిన ఏకూరగాయలైన కిలో 60 పైనే ఉన్నాయి. జిల్లాలో చాలా వరకు బావులు,బోర్లు భూగర్బ జలాలు అడుగంటడంతో చాలా మంది రైతులు నీరులేక తోటలు ఎండిపోతున్నాయని రైతులు కూరగాయల పంటలను వేయడం లేదు. అలాగే దుక్కుల సాగులో రైతులు బీజీగా ఉన్నారు. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని, గిట్టుబాటు అవడంలేదని కూరగాయల తోటలు వేయడంలేదు. దీనివల్ల దిగుబడులు తగ్గిపోవటంతో వ్యాపారులంతా ఇతర ప్రాంతాల్లో పండించిన కూరగాయలపై ఆధారపడుతున్నారు.తద్వారా డిమాండ్ పెరిగి సరఫరలేక పోవటంతో ధరలను పెంచి విక్రయిస్తున్నారు.
మరిన్నిరోజులు ఇదేపరిస్థితి ..
ఇప్పటికిప్పుడు కూరగాయల సాగు చేసే పరిస్థిలు లేవు తొలకరి ప్రారంభమయ్యాకే రైతులు నార్లు పోస్తారు అవి పెరిగి దిగుబడి రావాలంటే నెలకు పైగా సమయం పడుతుందని అప్పటి వరకు ధరలు ఇలాగే కొనసాగడం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి .అలాగే పెరిగిన కూరగాయల ధరలతో సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఒక్కో కుటుంబానికి కూరగాయల ఖర్చు నెలకు సుమారు రూ.1000 ఖర్చు చేస్తే ప్రస్తుతం,రూ.2000వేలకు కర్చు చేయవలసి వస్తుందని వాపోతున్నారు.
కూరగాయల ధరలు: బీరకాయ కిలో 100,చిక్కుడు కి.100 ,మిర్చి కి.100, టమాట కి. రూ.60 ,కాకరకాయ కి.రూ.60,బెండకాయ కి.రూ. 50,క్యాబేజి కి.రూ.60,వంకాయ కి.రూ.60,దొండకాయ కి.రూ.60, ఆకుకూరలు కి.రూ.40 సొరకాయ( 1) రూ.30
కూరగాయలు ధరలు మండిపోతున్నాయి: స్వర్ణలత, గృహిణి ….. భూపాలపల్లి ,కూరగాయల ధరలు పెరిగిపోవటంతో మేము ఐదుగురం కుటుంబ సభ్యులం కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది అయిన తప్పని పరిస్థిలల్లో అంతరేటు పెట్టి కూగాయలు కొనటం జరుగుతుంది.అలాగే కపూట కూరగాయలు మరొక పూట పచ్చల్లు వేసుకొని తింటున్నాం.

Vegetable prices up as summer sets in Telangana