Friday, March 29, 2024

దిగివచ్చిన కూరగాయల ధరలు

- Advertisement -
- Advertisement -

Vegetable prices are dropped

హైదరాబాద్ : ఒక వైపు పెరిగిన దిగుబడి, మరోవైపు రద్దయిన నోట్ల ప్రభావం వెరసి నగరంలోని రైతు బజార్ల మీద పడింది. నిన్న మొన్నటి దాకా ఆకాశాన్ని అంటిన ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒక్కొసారి పండిన అమ్ముడు పోక పొవడంతో గత్యంతరం లేని స్థితిలో వాటిని పశులకు దానాగా వాడుతున్నారు. మే నెలలో రూ. 66 నుంచి రూ.80 దాక ధర పలికిన టమాట నేడు కిలో 26. పలుకుతోంది.అదే విధంగా రూ. 80 దాలక పలికిని మిర్చి కిలో . రూ. 45 పలుకుతోంది. ప్రభుత్వాలను గడగడలాడించి ఉల్లి ధర సైతం కిలో రూ. 12 పలుకుతోంది. ఈ విధంగా ఏ కూరగాయల ధరలు చూసి కిలో రూ. 35. నుంచి 40 పలకడం గమనార్హం. ఇప్పుడు సకాలంలో పంటలు చేతికి అందడంతో పంటల దిగుబడి కూడా పెరిగి పోయి వాటి రేట్లు ఆమాంతంగా పడిపోయాయి.ఉత్పత్తి పెరగడంతో కూరగయాల ధరలు వినియోగ దారులకు అందుబాటులో ఉన్నాయి. వంకాయ,టమాట,బెండకాయ,సోరకాయ,బీర కాయ ఈ విధంగా నిత్యం అవసరం అయ్యే కూరగయాలన్నీ ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, వరంగల్,రంగారెడ్డి ,మెదక్ జిల్లాల నుంచి కూరగాయలు బోయిన్ పల్లి, గుడిమల్కాపూర్,మార్కెట్లకు తరలి వస్తుండటంతో ధరలు తక్కుముఖం పట్టాయి. నగర సరిహద్దు జిల్లాలో ఉద్యానవన శాఖ ప్రోత్సాహంతో పాలీహైస్( హరిత పందిరి) పంటలు కూడా మార్కెట్లకు వస్తున్నాయి. అదే విధంగా కర్నూలు,ఉభయ గోదారి,అనంతపురం,చిత్తూరు, జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలో మార్కెట్లను కూరగాయలను ముంచెత్తుతున్నాయి. దాంతో ధరలు సైతం ఒక్క సారిగా పడిపోయాయి. నగర జనాభ సుమారు కోటికి చేరింది. ఈ లెక్కన ప్రతి ఒక్కరు 350 గ్రాముల కూరగయాలు ప్రతి రోజు వినియోగించాల్సి ఉంది. ఈ విధంగా 35 లక్షల కిలోల కూరగాయలు నగర ప్రజలకు అవసరం ఉండగా హొల్‌సేల్ మార్కెట్లకు 25 లక్షల కిలోల వరకు కూరగాయలు వస్తున్నాయి. మిగాతావి నేరుగా దుకాణాలకు చేరుతున్నాయి. వేసవి కాలంలో 5 నుంచి 10 లక్షల కిలో వరకు కూరగాయల కొరత నగరంలో ఉంది. గతంతో పోలిస్తే ఆ స్థాయిలో ఇప్పుడు ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. పంట దిగుబడి అధికంగా ఉండటంతో మరి కొంత మేరకు కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కూకట్ పల్లి రైతుబజార్‌లోని కూరగాయాల ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి( బుధవారం నాటివి మాత్రమే)

టమాట కిలో ః రూ ః 26.00

వంకాయ కిలో ః రూః 23.00

బెండకాయ కిలో రూ ః 35.00

పచ్చిమిర్చి కిలో రూ ః 45.00

కాకర కిలో రూః 35.00

క్యాబేజ్ కిలో రూ ః 23.00

క్యాలిఫ్లవర్ కిలో రూ ః23.00

దొండకాయ కిలో రూ ః 26.00

బీట్‌రూట్ కిలో రూ ః 28.00

ఆలు కిలో రూ ః27.00

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News