Home ఆఫ్ బీట్ ఇక మెట్రో రైల్వేస్టేషన్లలో ‘మన కూరగాయలు’

ఇక మెట్రో రైల్వేస్టేషన్లలో ‘మన కూరగాయలు’

telangana-market

మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరం రోజు రోజుకూ నలువైపులా విస్తరిస్తోంది. దీంతో పాటు పెద్ద సంఖ్యలో జనాభా కూడా పెరగడంతో పాటు కాలనీలు విస్తరిస్తున్నాయి. వాటితో పాటు నగర ప్రజల నిత్యావసరాలు కూడా పెరుగుతున్నాయి. వాటిలో ముఖ్యంగా నగరవాసులకు సరిపడే కూరగాయలను మార్కెటింగ్ శాఖ పూర్తి స్థాయిలో అందించలేక పోతుంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా నగర వాసులు అవసరాలను తీర్చే కార్యక్రమంలో 11 రైతు బజార్లను ఏర్పాటు చేసింది. వీటిని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉన్నా స్థ లం అందుబాటులో లేకపోవడంతో కొన్ని రైతు బజార్ల కు మాత్రమే పరిమితమయ్యారు. కొత్త వాటిని ఏర్పా టు చేయలేక పోవడంతో 50 కిలో మీటర్లు విస్తరించిన నగరంలో ఉన్న 11 ఉన్న రైతు బజార్లు నగర వాసుల అవసరాలను ఏ మాత్రం తీర్చలేక పోతున్నాయి. వీటిలో కూరగాయలను కొనుగోలు చేయాలంటే ఎంత లేదన్నా ఐదు నుంచి 10 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అందుకే నగరవాసులు వారానికి సరిపడా కూరగాయలను తెచ్చుకుని ఫ్రిజ్‌లో ఉంచుతున్నా రు. ఈ విధంగా తాజా కూరగాయలు తినే అవకాశా న్ని వారు కోల్పోతున్నారు. దీంతో నగర వాసుల కూరగాయల అవసరాలను తీర్చేందుకు ‘మన కూరగాయ లు’ అవుట్ లెట్‌ల మీద దృష్టి పెట్టింది. వీటి ద్వారా నగర ప్రజలకు నాణ్యమైన కూరగాయలను సరసమైన ధరలో అందిస్తోంది.

ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా సుమారు 50కి పైగా ఔట్‌లెట్‌లను ప్రారంభించి అన్ని వర్గాల ప్రజలు నుంచి ఆదరణ పొందుతోంది. మన కూరగాయలు ఔట్‌లెట్‌లను 100లక్షంగా నిర్దేశించుకున్న మార్కెటింగ్ శాఖ తన లక్షాన్ని త్వరగా చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాటిలో భాగం గా మెట్రో రైల్వేస్టేషన్లలో మన కూరగాయల అవుట్‌లెట్‌లను మియాపూర్, నిజాంపేట, కూకట్‌పల్లి, జెన్టీ యు, మూసాపేట, సనత్‌నగర్, సంజీవ్ రెడ్డి నగర్, అమీర్‌పేట మెట్రో స్టేషన్ల వద్ద మన కూరయల అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ అంశంపై మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డితో మార్కెటింగ్ శాఖ అధికారులు చర్చించగా ఆ యన సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెప్పారు. అంతేకాకుండా మన కూరగాయలు అవుట్ లెట్‌లను మీపై ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను కూడా కోరుతోంది. ఔట్‌లెట్‌కు సంబంధించిన స్థలం చూసుకుంటే వాటికి కూరగాయలను తమశాఖ సరఫరా చేస్తానంటోంది. వీటి ఏర్పాటుకు రైతు బజార్లకు మాదిరిగా ఎకరాలు కొద్ది స్థలం అవసరం లేదు. ఎనిమిది అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవు సరిపోతుందంటున్నారు. పక్కా ఏర్పాట్లతో కూడిన దుకాణాలు కూడా అవసరం లేదు. కేవలం దీనికి కావాల్సింది. ఒక కంటైనర్ పట్టే స్థలం మాత్రమే. ప్రభుత్వ స్థలం లేకపోయినా ప్రైవేట్ వారు ముందుకు వచ్చినా పర్యావరణ హితంగా ఏసితో కూడిన మన కూరగాయలు దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. గేటెడ్ కమ్యూనిటీ అపార్టమెంట్లు వారు కాలనీలు, వారు కాస్త స్థలం చూపిస్తే అక్కడ మన కూరగాయలు అవుట్ లెట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు.