Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

కొండెక్కిన కూరగాయలు..

Vegitable Rates High In Vikarabad District

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతి నిధి: బెండ, దొండ, దోస, బీర, బీన్స్, గోరు చిక్కుడు, వంకాయ, కాకర, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్ ధరలు మాత్రం ఒకే ధరలకు విక్రయిస్తున్నారు.  మిర్చి ధరలు కాస్త అటు, ఇటుగా ఉన్నా కిలో ధర రూ.30 నుంచి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఆకు కూరలు ధరలు కూడా తగ్గడం లేదు. పాలకూర, తోటకూర, చుక్కకూర, గోంగూరు, పొన్నగంటి, మెంతికూర తదితర ధరలు అందుబాటులో లేకపోవడం వినియోగదారులకు రుచించడం లేదు.  వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లో జరిగే సంతల్లోనూ కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరో నెల రోజుల పాటు ఇదే విధమైన ధరలు అమలులో ఉంటాయని భావిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రవాణా అవుతున్న కూరగాయలు తగ్గుముఖం పట్టాయి. భూగర్భజలాలు అడుగంటడం వల్ల బోరుబావుల కింద పండించడం తగ్గించారు. జూన్, జూలై మాసాల్లో భారీ వర్షాలు కురిస్తే కూరగాయలకు అనుకూలం.  రైతుబజార్లలో ధరలు అనుకూలంగా ఉంటాయనుకుంటే అక్కడే ఇదే పరిస్థితి నెలకొంది. తాండూరులో రైతు బజార్ ప్రారంభించినా రైతులు అక్కడ విక్రయించడం లేదు. మార్కెట్లో దళారులు రాజ్యమేలుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూరగాయలు తెచ్చే రైతుల వద్ద టోకుగా తక్కువ ధరలకే కొనుగోలు చేసున్నా దళారులు అధిక ధరలు నిర్ణయించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. తాండూరు వంటి ప్రాంతాల్లో రైతులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి. గత్యంతరం లేక మార్కెట్‌కు తెచ్చిన కొద్ది సేపటికే దళారులకు విక్రయించి ఖాళీ గంపలతో వెను దిరుగుతున్నారు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే రైతులు ఇక్కడ మార్కెట్లలో గంటల తరబడి ఉండి అమ్ముకోలేక కూడా దళారులకు తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు.  సెప్టెంబరు మాసం నుంచి కూరగాయల ధరలు అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అప్పటి వరకు వినియోగదారులు ఓపికపట్టాల్సిందే మరి.

Comments

comments