Home ఆఫ్ బీట్ నడిరోడ్డుపైనే పార్కింగ్!

నడిరోడ్డుపైనే పార్కింగ్!

Vehicle Parking on Roads at Metro Rail Stations

మెట్రోస్టేషన్లలో లేని పార్కింగ్ సౌకర్యం
పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అధికారుల స్థలాల పరిశీలన

మనతెలంగాణ/సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచ స్థాయి హంగులతో మెట్రోని ర్మాణం హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చినప్పటినీ ప్రజలకు కష్టాలు మాత్రం తప్పడంలేదు. నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఎదురౌతున్నట్లు తెలుస్తోంది. మె ట్రో మొదటి కారిడార్ నాగోల్‌మియాపూర్ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉన్నాయి. మేజర్ స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం సరిగా లేదు. కొన్ని స్టేషన్లలో మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉన్నట్లు సమాచారం. మి యాపూర్, కూకట్‌పల్లి, జెఎన్టీయు, రసూల్‌పుర, నాగోల్, ఇతర కొన్నిస్టేషన్లలో మాత్రమే స్థలాలను లీజుకు తీసుకొని పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు మెట్రో అధికారులు. 24 మెట్రో స్టేషన్లలో దాదాపు సగం స్టేషన్లలో సరైన టూవీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్ సౌకర్యంలేదు. దీంతో రోడ్లపైనే వాహనాలను పార్క్ చేస్తున్నారు. సగం రోడ్డు ఈ వాహనాల పార్కింగ్‌కే సరిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పార్కింగ్ లేక ఇక్కట్లు…
అత్యధిక రద్దీగా ఉండే సికింద్రాబాద్ ప్రాంతంలోని సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ సదుపాయం లేక ప్రధాన రహదారిపైనే వాహనాలను నిలిపేస్తున్నారు. మెయిన్ రోడ్డు కావడంతో ఆర్టీసీ బస్సు లు, ప్రైవేట్ వాహనాలు, పాదాచారులు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మెట్రో స్టేషన్లలో సమస్య ప్రధానంగా కనబడుతోంది. దీంతోనే పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలో తెలియక చాలా మంది ప్రయాణికులు మెట్రో ప్రయాణమంటెనే వెనుకడుగు వస్తున్నారు. హబ్సీగూడ, తార్నాక, ఎన్జీఆర్‌ఐ, అమీర్‌పేట్ స్టేషన్లలోనూ ఇదే పిరిస్థితి ఉన్నట్లు సమాచారం. ప్రధాన రో డ్లపై పార్కింగ్ ఏర్పాటు చేయడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. అడ్డగోలుగా రోడ్డపైనే వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడంలేదు. షెడ్లు లాంటి నిర్మాణాలు లేకపోవడంతో వాహనాలు ఎండకు ఎండుతున్న పరిస్థితి. కొన్ని సందర్భాల్లో వాహనాలు ఎండ వేడితో అగ్నికి ఆహుతి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. టూ వీలర్ పార్కింగ్ ఉంటే ఫోర్ వీలర్ పార్కింగ్ ఉండదు, ఫోర్‌వీలర్ పార్కింగ్ ఉంటే టూవీలర్ పార్కింగ్ ఉండని పరిస్థితి నెలకొంది.

స్థలాల సేకరణలో అధికారులు…
పార్కింగ్ సమస్యను చెక్ పెట్టడానికి మెట్రో అధికారులు సరికొత్త ప్రణాళికను చేపడుతున్నారు. మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్సు లు నిర్మిస్తున్నారు. మెట్రో కారిడార్‌లోనే కాకుండా నగర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. దీనికోసం ప్రభుత్వ స్థలా లు, ఎంసీహెచ్ స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల స్థలాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ప్రభుత్వ కార్యాలయాలు, స్థ లాలు, స్కూళ్ల ఖాళీ స్థలాలను సేకరించి వాటిని లీజుకు తీసుకొని పార్కింగ్‌ను ఆయా స్థలాల్లో టెండర్ల ద్వారా పిలిచి ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ ప్రభుత్వ స్థలాలు స్టేషన్ల పరిధిలో అందుబాటులోకి లేనైట్లైతే అపార్ట్‌మెంట్లు, ప్రైవేట్ స్థలాల యాజమాన్యాలతో చ ర్చించి ప్రయాణికులకు ఎలాంటి ఇ బ్బందులు లే కుండా టూవీలర్, కా ర్ పార్కింగ్ సముదాయాలను ని ర్మించనున్నారు. వివిధ ప్రభుత్వ శా ఖల ఖాళీ స్థలాలు మెట్రో కారిడార్‌లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? మళ్టీ లెవల్ పార్కింగ్ సముదాయాలను ని ర్మించడానికి అ నువుగా ఉండే స్థలాలను మే 31లోగా గుర్తించే విధంగా గడువు ను అధికారులు విధించారు. స్థలాలను గుర్తించిన తరువాత టెండర్ల ను పిలిచి నగర వ్యాప్తంగా మల్టీలెవల్ పార్కింగ్ సముదాయాలను నిర్మిస్తామని అధికార వర్గాల ద్వారా తెలిసింది.