Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సర్వీసింగ్ తప్పనిసరిగా చేయించాలి

Untitled-1బైక్‌గానీ, కారుగానీ కొనగానే సరిపోదు. దాన్ని నిర్వహణ చేయటం కష్టంతో కూడుకున్నపని. ఎందుకంటే నిర్ణీత సమయంలోగా లేదా నిర్ణీత కిలోమీటర్లు తిరిగిన ప్రతి సారీ సర్వీసింగ్ చేయించాలి. లేదంటే ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. ఆ తరువాత మరమ్మత్తులకు అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుంది.
ఖర్చుల గురించి తెలిస్తే, వాటికి భయపడి సర్వీసింగ్‌లను క్రమం తప్పకుండా చేయిస్తారు. కారు సర్వీసింగ్‌లో అత్యంత ముఖ్యమైంది ఇంజిన్ ఆయిల్ మార్చటం. యూజర్ మాన్యువల్‌లో ఇచ్చినవిధంగా ఆయిల్‌ను మారుస్తూ ఉండాలి. లేదంటే అవసరానికి తగ్గట్టుగా టాప్‌అప్ చేయిస్తూ ఉండాలి. ఆయిల్‌ను మార్చకుండా అలాగే నడిపితే ఇంజిన్ కాలి బొగ్గవుతుంది. వాహనాన్ని నిర్వహించటంలో నిర్లక్షం వహిస్తే చివరికి మీ వాహనం ఇంజిన్‌ను మార్చడమా లేక రీబిల్డ్ చేయడమో చేయాల్సి ఉంటుంది.
వాహనాల్లో అప్పుడప్పుడు అనుకోకుండా వచ్చే చిన్నపాటి సమస్యలు సర్వీసింగ్‌లో సరిదిద్దుతారు. అది వాహనాల బ్రేక్‌లుగానీ, క్లచ్‌వైర్లు సెట్ చేయటం, అలాగే గేర్లు సరిగా పడుతున్నాయా లేవా అనే విషయాన్ని పరీక్షించి వాటిలోపాలుంటే సర్వీసింగ్‌లో సరిచేస్తారు. అలాగే వాహనంలోని అన్ని భాగాలు ఫ్రీగా అవ్వటం కోసం ఆయిల్ వేస్తారు. ఫలితంగా వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి ఇబ్బందీ కలగదు.

Comments

comments