Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

దివ్యాంగులను ఆదుకుంటాం: నాయిని

Handicaped

హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. దివ్యాంగులకు వాహనాలు, ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మంత్రుల మాట్లాడారు. సిఎం కెసిఆర్ దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఈటెల కొనియాడారు. కెసిఆర్ తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రశంసించారు. దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటామని హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి అభయమిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు ఉచితంగా వాహనాలను అందిస్తున్నామని వాసుదేవ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రుల నాయిని నరసింహా రెడ్డి, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, తదితరలు హాజరయ్యారు.

Comments

comments