Home జాతీయ వార్తలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్లకు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉండాల్సిందే!

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్లకు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉండాల్సిందే!

car

న్యూఢిల్లీ:  రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ల వాహనాలపై కూడా జాతీయ చిహ్నం బదులు రిజిస్ట్రేసన్ నంబర్లు ఉండాలంటూ గతంలోనే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ల అధికారిక వాహనాలకు కూడా రిజిస్ట్రేషన్ నంబర్లు ఉండాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఇలా ప్రత్యేకంగా వారి వాహనాలపై నాలుగు సింహాల గుర్తు ఉండటం వల్ల వాళ్లను టార్గెట్ చేసుకోవడం సంఘ విద్రోహ శక్తులకు సులభం అవుతుందని ఈ పిటిషన్ వేసిన ఓ “ఎన్ జివొ” వాదించింది. అంతేకాదు ఇలాంటి చిహ్నాలు ఉన్న కార్ల జోలికి పోలీసులు, ఇతర అధికారులు అస్సలు ఎవరు వెళ్లరు. దీనివల్ల నేరస్థులు, ఉగ్రవాదుల తమ కార్యకలాపాల కోసం ఇటువంటి కార్లను వాడే అవకాశం ఉందని పిటిషన్ స్పష్టంచేసింది. రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోవడం అంటే నిబంధనల ఉల్లంఘన జరగడంతోపాటు వాటికి ఇన్సూరెన్స్ లేదని కూడా స్పష్టమవుతుందని ఆ ఎన్ జివొ తన పిటిషన్‌లో పేర్కొంది. విదేశాంగ శాఖ ఆధీనంలో ఉన్న 14 కార్లను రిజిస్టర్ చేయలేదన్న ఓ ఆర్ టిఐ సమాచారం మేరకు ఈ పిటిషన్ దాఖలు చేశారు.