Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

వెంకటేష్-నాగచైతన్య మల్టీస్టారర్?

Multi-Starer

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీ అంటే గతంలో అదో ఊహ మాత్రమే అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు… స్టార్స్ నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరూ మల్టీస్టారర్ కాన్సెప్ట్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో మహేష్‌తో కలిసి ఈ ట్రెండ్‌ను ఆరంభించిన వెంకటేష్ గతంలో నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ మూవీలో ఓ కేమియో రోల్ కూడా చేసి అలరించాడు. ఇప్పుడు ఈ మేనమామ, మేనల్లుడు కలిసి మరోసారి ఆన్‌స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ తాజాగా వెంకటేష్‌ను కలిసి ఓ కథ వినిపించాడట. ఫ్యామిలీ డ్రామా అయిన ఈ కథ వెంకటేష్‌కు విపరీతంగా నచ్చేసిందట. పైగా గతంలో నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’, నాగచైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి హిట్ చిత్రాలను తీసిన దర్శకుడు కావడంతో… కళ్యాణ్ కృష్ణకు వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. అయితే ఈ కథలో ఓ ప్రధానమైన క్యారెక్టర్‌ను ఎవరితో చేయించాలన్న దగ్గరే సమస్య ఉత్పన్నమైందట. దీనికి కూడా పరిష్కారాన్ని చూపించేసిన వెంకటేష్ ఆ రోల్‌కు నాగచైతన్య అయితే సరిగ్గా సరిపోతాడని చెప్పాడట. తనకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణతో ఈ చిత్రం చేయడానికి చైతన్య కూడా ఒప్పుకున్నాడని తెలిసింది. త్వరలో ఈ మల్టీస్టారర్‌పై ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Comments

comments