Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో గులాబీ హాట్రిక్

Vemulawada Elections Results 2018

మన తెలంగాణ/సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలుండగా సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజక వర్గాలున్నాయి. జగిత్యాల జిల్లాలోని కథలాపూర్, మేడిపల్లిలు జిల్లాలోని వేములవాడ నియోజక వర్గంలో చేరగా, జిల్లాలోని బోయిని పల్లి మండలం చొప్పదండి నియోజక వర్గం పరిధిలోకి, ఇల్లంతకుంట మండలం మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లడం గమనార్హం. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాలు ఏర్పడిన 2009 సం వత్సరం త రువాత హాట్రిక్ విజయాలు సాధించిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎంఎల్‌ఏ చెన్నమనేని రమేశ్‌రావులు మరోసారి బరిలో నిలిచి విజయపథం వైపు అ డుగులు వేస్తున్నారు. విలక్షణ ఓట రు తీర్పులు వెలువడే సిరిసిల్ల ని యోజక వర్గం 1952లో ఉమ్మడి ని యోజక వర్గంగా ఆవిర్భవించింది.

ఉమ్మడి నియోజక వర్గం అంటే ఒ కే నియోజక వర్గం నుండి ఒక జనరల్ అభ్యర్థిని, ఒక రిజర్వ్‌డ్ అభ్యర్థిని ఎన్నుకోవడం అన్నమాట. 1952 లో మొదటి సారి సిరిసిల్ల ఉమ్మడి నియోజ క వర్గానికి జరిగిన ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులు జే ఆనందరా వు, జేఎం రాజమణిదేవి ఎన్నికయ్యారు. 1957లో కూడా సిరిసిల్ల ఉ మ్మడి నియోజక వర్గంగానే కొనసాగింది. 1957లో అమృతలాల్ శు క్ల, కర్రెల్లి నర్సయ్య ఎన్నికయ్యారు. 1962లో సిరిసిల్ల ఉమ్మడి ని యోజక వర్గం స్థాయినుండి ప్రత్యేక నియోజక వర్గంగా మారిపోయింది. రిజర్వ్‌డ్ స్థానంగా నేరెళ్ల నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశా రు. 1962లో ఏర్పడి 2009 లో కాల గర్భంలో కలసిన నేరెళ్ల ని యోజక వర్గం స్థానంలో నియోజక వర్గాల పునర్విభజనలో ప్రస్తు తం కొత్తగా 2009లో వేములవాడ నియోజక వర్గం రూపుదిద్దుకుంది.

1962లో సిరిసిల్ల నియోజక వర్గం నుండి జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1967లో చెన్నమనేని రా జేశ్వర్‌రావు సిపిఐ అభ్యర్థిగా విజయబావుటా ఎ గరేశారు. 1972లో కాం గ్రెస్ నుండి జువ్వాడి న ర్సింగరావు, 1978లో సిపి ఐ నుండి చెన్నమనేని రాజేశ్వర్‌రావు ఎన్నికయ్యారు. 1983లో టిడిపి అభ్య ర్థి వుచ్చిడి మోహన్ రెడ్డి సిరిసిల్ల శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1985లో చెన్నమనేని రాజేశ్వర్‌రావు సిపిఐ ఎన్నికయ్యారు. 1989లో సిపిఐఎంఎల్ అభ్యర్థి ఎన్‌వి కృష్ణయ్య ఎంపికయ్యారు. 1994లో చెన్నమనేని రాజేశ్వర్‌రావు సిపిఐ ఎన్నికయ్యారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి రేగులపాటి పాపారావు ఎన్నికయ్యారు. 2004లో చెన్నమనేని రాజేశ్వర్‌రావు టిడిపినుండి ఎన్నికయ్యారు. ఆ తరువాత సిరిసిల్ల నియోజకవర్గం పేరు అలాగే ఉన్నా దాని పునర్వవస్థీకరణ వలన సిరిసిల్ల నియోజక వర్గంలోని వేములవాడ, కోనరావుపేట, కథలాపూర్, మేడిపెల్లి,రుద్రంగి, చందుర్తి మం డలాలు కొత్త నియోజక వర్గంగా రూపుదిద్దుకుని వేములవాడగా రూపాంతరం చెందింది. సిరిసిల్ల నియోజక వర్గంలోకి నేరెళ్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్ల, ముస్తాబాద్, వీర్నపల్లి,తంగళ్లపల్లి మండలాలు చేర్చి సిరిసిల్ల నియోజక వర్గంగా2009లో మారింది.

సిరిసిల్ల నియోజక వర్గంలో గతంలో ఉన్న బోయినిపల్లి మండలం చొప్పదండి నియోజక వర్గంలోకి మారగా, నేరెళ్ల నియోజక వర్గంలోని ఇల్లంతకుంట మండలం మానకొండూర్ మండలంలోకి మారింది. నూతనంగా ఏర్పడిన సిరిసిల్ల నియోజక వర్గంలో జరిగిన మొదటి ఎన్నికల్లో 2009, 2010 ( ఉప ఎన్నిక ), 2014లో కూడా తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన కెటిఆర్ ఎన్నికయ్యారు. సిరిసిల్ల నియోజక వర్గం నుండి చెన్నమనేని రాజేశ్వర్ రావు ఐదుసార్లు శాసన సభకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ వరుసగా రెండో సారి ఎన్నికై న సందర్భం ఎప్పుడూ లేకపోవడం ఓటరు విలక్షణ తీర్పుకు నిదర్శనంగా గమనించాలి. ని యోజకవర్గం ఆవిర్భవించిన నాటినుండి రెండోసారి వరుసగా ఎన్నికైన అభ్యర్థులు 2010 వరకు ఎప్పు డూ లేక పోవడం గమనా ర్హం. సిరిసిల్ల నుండి 2009, 2010 (ఉప ఎన్నిక ),2014లో కూడా మూడుసార్లు వరుసగా ఎన్నికైన ఘనత కేవలం ఒక్క టిఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి కెటిఆర్‌కే దక్కింది.

అంతే కాకుండా సిరిసిల్ల నుండి శాసన సభకు ఎంపికై మంత్రిగా కొనసాగిన ఘనత కూడా కేటిఆర్‌కే స్వంతమయింది. కేటిఆర్ 2009లో 36,783 ఓట్లు ( ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 171 మెజార్టీ )సాధించుకోగా, 2010 ఉప ఎన్నికలో కేటిఆర్ 87,876 ఓట్లు ( ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 68,219 ఓట్ల మెజార్టీ ) సాధించగా, 2014లో కేటిఆర్ 92,135 ఓట్లు సాధించుకుని ( ప్రత్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో ) గెలుపొందారు. 2018 ఎన్నికల్లో సిరిసిల్ల స్థానం కోసం మంత్రి కేటిఆర్ తెరాస అభ్యర్థిగా, కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి తలపడనున్నారు. ఇదిలా ఉంటే 1962లో ఏర్పడి 2009లో కాల గర్భంలో కలిసి పోయిన నేరెళ్ల నియోజక వర్గం నుండి జేఎం రాజమణి దేవి, కర్రెల్లి నర్సయ్య, బండారి జానకీరాం, గొట్టె భూపతి, పాటి రాజం, ఉప్పరి సాంబయ్య, సుద్దాల దేవయ్య, కాశిపేట లింగయ్యలు శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు. పాటి రాజం, సుద్దాల దేవయ్యలు మంత్రులుగా కూడా కొనసాగారు.

నియోజక వర్గాల పునర్విభజనలో నేరెళ్ల కాలగర్భంలో కలిసిపోగా కొత్తగా 2009లో వేములవాడ నియోజక వర్గం రూపుదిద్దుకుంది. 2009లో ఆవిర్భవించిన వేములవాడ నియోజక వర్గం తొలి ఎంఎల్‌ఏగా చెన్నమనేని రమేశ్ గెలిచారు. 2009, 2010 (ఉప ఎన్నిక ),2014లో కూడా చెన్నమనేని రమేశ్ తన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్‌పై (మూడు సార్లు కూడా ) విజయం సాధించారు. రమేశ్ మొదటి సారి 36,601 ఓట్లు, ఉప ఎన్నికలో 79,146 ఓట్లు, 2014లో 58,414 ఓట్లు సాధించారు. శ్రీనివాస్‌కు 2009లో 34,780 ఓట్లు,2010లో 28,695 ఓట్లు, 2014లో 53,146 ఓట్లు రావడం గమనార్హం. 2018లో మరోసారి వేములవాడలో తెరాస అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్‌లు తలపడేందుకు ప్రచారం సాగిస్తున్నారు.

Vemulawada Elections Results 2018

Telangana News

Comments

comments