Search
Thursday 15 November 2018
  • :
  • :

దేశానికే హైదరాబాద్ ఐటి హబ్‌గా మారింది…

venkaiah naidu said hyderabad will continue to make great strides

హైదరాబాద్: దేశానికే హైదరాబాద్ ఐటి హబ్‌గా మారిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాబోయేరోజుల్లో హైదరాబాద్ మరింత గొప్ప ప్రగతి సాధిస్తుందని ఈ విషయంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నారు. నగరంలోని హెచ్‌ఐసిసిలో శుక్రవారం జరిగిన హైసియా 26వ సదస్సుకు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలు ఐటి కంపెనీలు, స్టార్టప్స్‌కి 7 విభాగాల్లో అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సర్కార్ పాలసీలు ఐటి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పారు. టిహబ్ ద్వారా స్టార్టప్స్‌కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందజేయడం అభినందనీయమన్నారు. ఇక్కడి ఐటి పరిశ్రమ హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలుపుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Comments

comments