Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణం స్వీకారం

                     Venkaiaha-naidu

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ఎం. వెంకయ్యనాయుడు 13వ ఉపరాష్ట్రపతిగా  ప్రమాణం స్వీకారం చేశారు.  వెంకయ్య నాయుడు చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.  ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బిజెపి సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రులు,  రాజ్యసభ ఎంపిలు, లోక్ సభ స్పీకర్, ఎన్డిఎ ఎంపిలు, పలు రాష్ట్రల సిఎంలు, వివిధ పార్టీల అగ్రనేతలు నేతలు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన మూడో తెలుగు వ్యక్తి వెంకయ్య.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిజెపి పార్టీ పార్లమెంటరీ బోర్డ్, సెంట్రల్ బోర్డు కమిటీ, అధికార ప్రతినిధిగా సేవలందించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తి వెంకయ్యనాయుడు. 2004 వరకు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా సేవలు చేశారు. మోడీ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు ఆయనను వరించాయి. ఆంధ్రా యూనివర్సిటీలో పిజి చదివారు. కాలేజీ రోజుల్లో సంఘ్ భావజాలానికి  అకర్షితుడై ఆర్ఎస్ఎస్ లో చురుకుగా పాల్గొంటూ బిజెపిలో చేరారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత హిందీ భాషపై పట్టు సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. జై ఆంధ్రా ఉద్యమంతో మంచి నాయకుడిగా వెంకయ్య గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. 1975లో జనతా పార్టీ అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. 1978లో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కమల దళంలో ట్రబుల్ షూటర్ గా వెంకయ్య నాయుడు పేరు తెచ్చుకున్నారు.

Comments

comments