Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

క్రిష్‌తోనే వెంకటేశ్ చిత్రం

Venky‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత దర్శకుడు క్రిష్ చేయబోయే సినిమా వెంకటేశ్‌తోనే అని తెలిసింది. సాధారణంగా తన ప్రతి సినిమాకు కొంత గ్యాప్ తీసుకుంటాడు క్రిష్. కానీ ఈసారి ఏమాత్రం గ్యాప్ తీసుకోవడం లేదట. ఇక ‘గురు’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు వెంకటేశ్. దీని తర్వాత చేయబోయే సినిమాపై అతను ఇప్పటికే దృష్టి పెట్డాడు. ఇదిలా ఉండగా దర్శకుడు తిరుమల కిషోర్… వెంకటేశ్‌కు నచ్చినట్లుగా కథను సెట్ చేయలేకపోతున్నాడు. దీంతో ఈ సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఈ నేపథ్యంలో క్రిష్‌తో సినిమా చేయాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నాడని సమాచారం. గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల అనంతరం పరిస్థితిని చూసి వెంకటేశ్… క్రిష్‌తో సినిమాను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇక పూరీతో వెంకటేష్ ఓ సినిమా చేస్తాడనే టాక్ వినిపించింది. కానీ సినిమా బడ్జెట్ విషయంలో వెంకటేశ్, సురేష్‌బాబుకు మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదట. అదే క్రిష్ అయితే తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్‌పుట్ ఇస్తాడు. అందుకే వెంకటేశ్ తన నెక్స్ మూవీని క్రిష్‌తోనే చేయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం.

Comments

comments