Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మరో మల్టీస్టారర్‌లో…

Venkatesh with Dulquer Salmaan multi Starrer Movie

ఈమధ్య తెలుగులో మూడు ట్రెండ్స్ మొదలయ్యాయి. ఒకటి బయోపిక్‌లు… రెండు బోల్డ్ సినిమాలు… మూడు మల్టీస్టారర్లు. ఇప్పటికే చాలా బయోపిక్‌లు సెట్స్‌మీద ఉండగా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. బోల్డ్ సినిమాలకు కూడా ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోంది.  ఇక నాగార్జున-నాని మల్టీస్టారర్ ‘దేవదాస్’ ఈనెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. మల్టీస్టారర్ సినిమాల్లో అందరికంటే ఎక్కువ జోరు చూపిస్తున్న హీరో వెంకటేష్. ఇప్పటికే వరుణ్‌తేజ్‌తో ‘ఎఫ్2’, నాగచైతన్యతో ‘వెంకీ మామ’ అనే రెండు మల్టీస్టారర్లలో నటిస్తున్నాడు ఈ సీనియర్ స్టార్. ఈ రెండు కాకుండా మరో క్రేజీ మల్టీస్టారర్‌కు అతను పచ్చ జెండా ఊపాడని తెలిసింది. ఈసారి టాలీవుడ్ హీరోతో కాకుండా మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో వెంకటేష్ కలిసి నటిస్తాడట. ఈ సినిమా స్టోరీ యుద్ధ నేపథ్యంలో సాగుతుందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమా వార్ డ్రామా అని… ఈ సినిమాకు ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేస్తారని సమాచారం. ఇక ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. ఇక వెంకటేష్‌తో దుల్కర్ కాంబినేషన్ అంటే సినిమా ప్రకటించిన రోజే క్రేజీ ప్రాజెక్టుగా మారడం ఖాయం.

Comments

comments