Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

బంజారాహిల్స్‌లో శ్రీవారి ఆలయం : టిటిడి

TIRUMALAతిరుపతి: హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో రూ.18కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) తీర్మానించింది. మంగళవారం అన్నమయ్య భవన్‌లో తితిదే పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • పోటు విభాగం తాత్కాలిక కార్మికుల పదవీకాలం ఏడాదిపాటు పొడిగింపు.
  • సర్వభూపాలం, ముత్యపు పందిరాల కోసం రూ.3.86కోట్లు కేటాయింపు.
  • మే 22 నుంచి శుభప్రదం పేరుతో సనాతన ధర్మంపై విద్యార్థులకు అవగాహన సదస్సు.
  • పద్మావతి మహిళా వర్సిటీకి కేటాయిస్తున్న నిధులు రూ.50లక్షల నుంచి రూ.కోటికి పెంపు.
  • స్విమ్స్ అభివృద్ధికి రూ.4.80కోట్లు.
  • ఒంటిమిట్టలో భక్తులకు వసతి, కల్యాణవేదిక, ఉద్యానవన అభివృద్ధికి రూ.4.60కోట్లు.
  • హిందూపురంలోని రంగనాథస్వామి ఆలయ పుష్కరిణి నిర్మాణానికి రూ.55లక్షలు.
  • అనంతపురం జిల్లా చిలమత్తూరులో రూ.1.05కోట్లతో కల్యాణమండపం నిర్మాణం.
  • ఏడాది పాటు ఆవునెయ్యి కోసం రూ.66.42కోట్లు కేటాయింపు.
  • నైరోబిలో శ్రీనివాస కల్యాణం నిర్వహించేందుకు తీర్మానం.
  • తిరుచానూరు అన్నదాన సత్రం కోసం రూ.6.7కోట్లు కేటాయింపు.
  • పరిపాలన భవన ప్రాంగణంలో రూ.4.7కోట్లతో పరకామణి, ట్రెజరీ శాఖలకు భవనాలు.

Comments

comments