Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

‘వెంకీ మామ’ షూటింగ్ షురూ

Venky-Mama

మొదటిసారి మావయ్య వెంకటేష్‌తో కలిసి నాగచైతన్య నటిస్తున్న ‘వెంకీ మామ’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌ను  ఎటువంటి హడావిడి లేకుండా మొదలుపెట్టేశారు. విశిష్ట అతిథి ఎవరూ లేకుండానే సినిమా యూనిట్ మధ్యనే సినిమాను ప్రారంభించారు. ‘జై లవ కుశ’ సినిమా తర్వాత 8 నెలల గ్యాప్ తీసుకున్న దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కోన వెంకట్, సురేష్‌బాబులతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే వరుణ్‌తేజ్‌తో ‘ఎఫ్2’ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న వెంకటేష్ ఇప్పుడు నాగచైతన్యతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు. నిజ జీవితంలాగే  ఇందులో కూడా వెంకటేష్, చైతన్య మామ, అల్లుడి పాత్రలు చేయబోతున్నట్టు సమాచారం. ఇక దర్శకుడు బాబీకి ఇది నాలుగవ సినిమా. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ తర్వాత అతను చేస్తున్న మూవీ ఇది. దగ్గుబాటి, అక్కినేని కాంబో మూవీ కాబట్టి ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

Comments

comments