Home రాజన్న సిరిసిల్ల అభివృద్ధి పథంలో వీర్నపల్లి మండలం

అభివృద్ధి పథంలో వీర్నపల్లి మండలం

meeting

* కేజీబీవీ, ఎంఆర్‌సీ భవనాలకు భూమిపూజ
మన తెలంగాణ/వీర్నపల్లి : వీర్నపల్లి మండలం అన్ని రంగాల్లో అభివృ ద్ధి చెందుతుందని దీనికి తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో రూ. 2.5కోట్లతో నిర్మించే కేజీబీవీ పాఠశాల భవన సముదాయంతో పాటు, రూ.31లక్షలతో నిర్మించే మండల వనరుల కేంద్ర భవనానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను వీర్నపల్లి గ్రామాన్ని దత్తత తసుకున్న తరువాత ఎలా అభివృద్ధి చెందించాలా అనే ఆలోచనతోనే తన ప్రయాణం సాగిందని, అది కాస్తా ఇప్పుడు మండలంగా ఏర్పడేందుకు దోహదపడిందన్నారు. రాబోయే రోజుల్లో ఇది అన్ని మండలాలకు దీటుగా అభివృద్ధి చెందించేలా తగు సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అభివృద్ధి పనులు జరుగుతుంటే ప్రజలు దీనికి సహకరించాలని కోరారు. కంచర్ల గ్రామం నుండి రంగంపేటవరకు గల పాత రహదారిని తిరిగి పునరుద్ధరించేందుకు నిధులు మంజూరి చేయిస్తానని తెలిపారు. ఆడపిల్లలకు కావాల్సిన చదువులు రెసిడెన్సియల్ హాస్టళ్లలోనే ఇంటర్ వరకు సీబీఎస్‌ఈ సెలబస్ ప్రవేశపెట్టడంతోపాటు భోజన వసతి అందించడం జరుగుతుందన్నారు. నిరుపేద తల్లిదండ్రులకు తమ పిల్లల పెండ్లిలు బరువు కాకూడదనే ఉద్దేశ్యంతో సిఎం కళ్యాణ లక్ష్మి పథకం, షాదీముబారక్ పథకాల ద్వారా రూ. 1లక్ష116లు అందించడం గొప్పవిషయం అన్నారు. కొత్తగా ఏర్పడిన కేజీబీవీలో బాలికలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈచ్ 1 క్యాచ్ 4 అనే కొటేషన్ పద్ధతిలో ముందుకు సాగాలని కోరారు.టెస్కాబ్ చైర్మన్ కొండూ రి రవీందర్‌రావు, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, ఎంపీపీ ఎలుసాని సుజాత, జడ్పీటీసీ తోట ఆగయ్య, ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, కుంబాల మల్లారెడ్డి, సంజీవలక్ష్మిమల్లేశం ఉన్నారు.