Search
Thursday 18 October 2018
  • :
  • :

చరణ్, బోయపాటి మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

Very Interesting Title for Ramcharan's 12th Movie?

హైదారబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ రిసెంట్ గా ‘రంగస్థలం’ మూవీతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మగధీర సినిమా తరువాత ఆ స్థాయి విజయాన్ని చెర్రీకి రంగస్థలం అందించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిందీ మూవీ. ప్రస్తుతం చరణ్ తన 12వ సినిమాను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం యూర‌ప్‌లోని అజ‌ర్ బైజాన్‌లో జ‌రుగుతోంది. అయితే, ఈ సినిమా టైటిల్ విషయంలో గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా పలు కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ చిత్రం కోసం మూవీ యూనిట్ ఓ  ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో గుసగులు వినబడుతున్నాయి.

అది కూడా తండ్రి మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ టైటిల్ అని తెలుస్తోంది. 90వ దశకంలో చిరు నటించిన ‘స్టేట్ రౌడీ’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇపుడు ఇదే సినిమా టైటిల్‌ను చెర్రీ మూవీకి పెడితే బాగుంటుందని చిత్ర బృందం సమాలోచనలో ఉన్నట్లు తెలిసింది. అలాగే చరణ్, బోయపాటి మూవీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ చిత్రానికి స్టేట్ రౌడీ టైటిల్ పర్ఫెక్ట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ ఆలోచనగా తెలుస్తోంది. ‘స్టేట్ రౌడీ’తో పాటు ‘రాజవంశస్థుడు’, ‘రాజమార్తాండ’ అనే టైటిల్స్ కూడా పరిశీలన ఉన్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికార సమాచారం లేదు. మరీ చెర్రీ మూవీకి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచిచూడక తప్పదు. ఇదిలాఉండగా ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల చేయనున్నారట.

Comments

comments