Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మెగాస్టార్ వెరీ స్పెషల్ మూవీ

chiruమెగాస్టార్ చిరంజీవి, కాజల్ హీరోహీరోయిన్‌లుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. ఇటీవలే యూరప్ షెడ్యూల్ పూర్తిచేసుకొని ఈ చిత్రం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. గురువారంతో టాకీ చిత్రీకరణ పూర్తయింది. రామోజీ ఫిలింసిటీలో బ్యాలెన్స్ సాంగ్‌ను శుక్రవారం నుంచి చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రణతో మొత్తం షూటింగ్ పూర్తయినట్టే. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌చరణ్ మాట్లాడుతూ “మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే వెరీ స్పెషల్ మూవీ ఇది. ఓ చక్కని కథాంశంతో, విజువల్ గ్రాండియారిటీతో దర్శకుడు వి.వి.వినాయక్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. యూత్ సహా కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. శుక్రవారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చివరి పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ పాటతో మొత్తం షూటింగ్ పూర్తయినట్టే. సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం”అని అన్నారు.

 

Comments

comments