Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

వినకుంటే…వేటే!

ladyకలెక్టర్ల పొలిటికల్ బదిలీతో..
మంత్రుల పరోక్ష హెచ్చరికలు

మన తెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో : ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతల హవా విస్తృతమవుతున్నాయన్న అభిప్రా యాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రుల ఆధిపత్యానికి సర్కారు సైతం అండగా నిలుస్తుందని అంటున్నారు. మంత్రుల మాటలకే కాకుండా అధికార పార్టీ సీనియర్ నేతలకు ఎవరు అడ్డువచ్చినా వారి అడ్రసు సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని అంటున్నారు. వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులైనా సాధారణ జిల్లా స్థాయి అధికారులైనా అధికార పార్టీ నేతల మాటలకు అడ్డు చెప్పడం కుదరదని అంటున్నారు. నిబంధనలు, సర్కారు ఆదేశాలు, అధికారిక నియామకాలు వీరి ముందు బలాదూర్ కావాల్సిందే. శనివారం రాత్రి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కలెక్టర్లను, ఓ ఎస్పీని ఆకస్మికంగా బదిలీ చేసిన వ్యవహారం అధికార పార్టీ నే తల హవాకు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. గత కొంత కాల ం నుంచి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కలెక్టర్లు అక్కడి మంత్రుల మాటను జవ దాటుతుండడమే కాకుండా నిబంధనలు, నియమాల పేరిట ఆ మంత్రుల సిఫార్సులను పక్కన పెడుతున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడుగా అధికార పార్టీ సీనియర్ నాయకుల పైరవీలకు ఈ కలెక్టర్లు చెక్ పెడుతూ వచ్చారని అంటున్నారు. అయితే ఆదిలాబాద్ కలెక్టర్ బుద్దప్రకాష్ ఎం జ్యోతికి అక్కడి మంత్రి జోగురామన్నతోనూ, నిర్మల్ కలెక్టర్ ఇల్లంబర్తికి స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోనూ విభేదాలు కొనసాగుతు న్న సంగతి బహిరంగ రహస్యమే. ఈ ఇద్దరు కలెక్టర్లు మంత్రు ల మాటలను బేఖాతరు చేస్తూ ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు ఈ క లెక్టర్ల బదిలీకి మంత్రులు విశ్వ ప్రయత్నం చేస్తూ వచ్చారు. స మయం కోసం వేచి చూస్తున్న మంత్రులకు జిల్లాలో తీవ్రమైన ఆదివాసీల ఆందోళన కలిసి వచ్చినట్లైందని అంటున్నారు. ఆదివాసీల ఆందోళనలను నివారించడంలో యంత్రాంగం విఫలమైందన్న అంశాన్ని ఈ ఇద్దరు మంత్రులు సిఎం వద్ద బలంగా వినిపించినట్లు సమాచారం. అయితే ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ను సాకుగా చూపి మిగితా ఇద్దరు కలెక్టర్లను సైతం బదిలీ వి షయంలో బలి పశువులను చేశారని అంటున్నారు.

Comments

comments