Home తాజా వార్తలు ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ ఇకలేరు

ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ ఇకలేరు

Veteran Director R.Thyagarajan Passes Away Of Heart Attack

చెన్నై: తమిళ సీనియర్ దర్శకనిర్మాత ఆర్.త్యాగరాజన్(74) కన్నుమూశారు. చెన్నైలోని వలసరవాక్కంలో గల ఆయన స్వగృహంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. త్యాగరాజన్ కు సుబ్బులక్ష్మి అనే భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి అగ్రనటులతో సినిమాలు నిర్మించిన త్యాగరాజన్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 35 చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్యాగరాజన్ మృతి తమిళ సినీ పరిశ్రమకు తీరనిలోటు అని అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి.