Home తాజా వార్తలు రిటైర్మెంట్ ప్రకటించిన రామ్ జెఠ్మలానీ

రిటైర్మెంట్ ప్రకటించిన రామ్ జెఠ్మలానీ

Ram-Jethmalani

న్యూఢిల్లీ : ప్రముఖ న్యాయవాది, బిజెపి మాజీ నాయకులు రామ్ జెఠ్మలానీ(94) తన న్యాయవాద వృత్తికి రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు 7 దశాబ్దాలుగా ఆయన ఈ వృత్తిలో కొనసాగిన ఆయన శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. కొత్త సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యుపిఎ ప్రభుత్వంలానే, ఎన్డిఎ ప్రభుత్వం కూడా దేశాన్ని పతనం దిశగా నడిపిస్తుందన్నారు. తాను కేవలం తన వృత్తికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, తాను బ్రతికున్నంత వరకు అవినీతమయమైన రాజకీయాలపై పోరాటం చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించడానికి బార్ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.