Home తాజా వార్తలు కులవృత్తులకు అధిక ప్రాధాన్యత : మంత్రి నిరంజన్ రెడ్డి

కులవృత్తులకు అధిక ప్రాధాన్యత : మంత్రి నిరంజన్ రెడ్డి

Niranjan Reddyవనపర్తి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని,  ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,పౌరసరఫరాల,సహకార శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి మండల పరిధిలోని రాజపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో కులవృత్తుల పరిరక్షణకు సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కులవృత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జీవాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న టీకాలు, మందులను మేకలకు, గొర్రెలకు ఇప్పించి వ్యాధులను నివారిం చుకోవాలని కోరారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. జీవాలను సంరక్షించుకునేందుకు ముందస్తుగా టీకాలు, మందులు వేయించాలని రైతులకు సూచించారు. విరివిగా పశువైద్య శిబిరాలను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకుని గొర్రెలు, పశువులు, మేకలకు వ్యాధులు సోకకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం యాదవ సంఘం ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్‌రెడ్డిని శాలువా పూలమా లలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిడ్పి చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపిపి కిచ్చారెడ్డి, డిఎస్‌ఇసియు చైర్మన్ కురుమూర్తి యాదవ్, జిల్లా పశుసంవర్థక శాఖా ధికారి డా. వెంకటేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్స్ వాకిటి శ్రీధర్, గట్టుయాదవ్, డిఎస్‌బిసియు వైస్ చైర్మన్ చంద్రయ్య యాదవ్, డైరెక్టర్ బీచుపల్లి యాదవ్, సర్పంచ్ లు మాధవరెడ్డి, భానుప్రకాష్‌రావు, డా. ఆంజనేయులు, నాయకులు తిరుపతయ్య, గున్నయ్య, యాదవ సంఘం సభ్యులు ,మండల టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Veterinary Medical Camp In Wanaparthy