Home దునియా విగ్రహ మనిషికి నిగ్రహం ఎక్కువ

విగ్రహ మనిషికి నిగ్రహం ఎక్కువ

Human-Statue

మీరెప్పుడైనా చెన్నై వి జి పి గార్డెన్‌కి వెళ్ళారా..? వెళ్తే అక్కడ ఉండే స్టాచ్యూ మ్యాన్‌ను చూశారా..? చూసినా నవ్వించే ప్రయత్నం చేశారా..? అతను నవ్వలేదు కదా ఇంచు కూడా కదలలేదంటాను. ఎందుకంటే అబ్దుల్ అజీజ్ నిగ్రహం అటువంటిది. గత 31 సంవత్సరాలుగా వి జి పి గార్డెన్‌లో స్టాచ్యూమ్యాన్‌గా కదలక, మెదలక నిలుచునే అజీజ్‌ను అందరూ ముద్దుగా బాబు బాబా అని పిలుస్తారు.

విగ్రహంగా నిలుచునే ఇతడిని ఎవరైనా నవ్విస్తే 10,000 రూపాయల ప్రైజ్ కూడా గెలుచుకోవచ్చు కాని ఇంత వరకు ఎవ్వరూ అతడిని నవ్వించలేకపోయారు. రాజస్తానీ వేషధారణలో రోజూ ఆరు గంటలపాటు కదలకుండా నిలుచోవడమే కాకుండా కంటి రెప్పకూడా ఆర్పడు అజీజ్. ఇదంతా ఎలా సాధ్యమంటే ఉదయాన్నే ఆరు గంటలకు లేచి యోగా చేస్తానని సావధానంగా చెబుతున్నాడు.