Search
Monday 24 September 2018
  • :
  • :

మహాగణపతిని దర్శించుకున్న వెంకయ్య

M-Venkaiah-Naidu

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎమ్ వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం ఖైరతాబాద్‌ శ్రీచండీ కుమార అనంత మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ… రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండేలా ప్రార్థించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగివుండాలి. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే గణపతిని కోరుకుంటాం.  వెంకయ్యతో పాటు మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ ఎంఎల్ఎ చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Comments

comments