Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సౌదీలో చంపేస్తారు..రక్షించండి

Sadhik

హైదరాబాద్‌సిటీబ్యూరో: సౌదీ అరేబియాలో ఉద్యోగం అనగానే ఎగిరి గంతేశాడు. రెండుమూడేళ్లు పనిచేసుకుని జీవితంలో స్థిరపడాలనే ఆశతో వెళ్లాడు. చెప్పిన ఉద్యోగం ఇప్పించకుండా అడవిలో ఒంటెల వద్ద వెట్టిచాకిరిలో తోసేశాడు ఏజెంట్. బతుకు జీవుడా అంటూ 11 నెలలు అడవిలోనే జంతువుల మధ్య అడవిలోనే బతుకీడుస్తున్నాడు.

నెలవారి జీతం కూడా ఇవ్వడం లేదు. బాధితుడికి అతని కుటుంబ సభ్యులకు కూడా కనీసం ఫోన్ సంభాషణలు కూడా లేవు. ఈ విషయం తెలుసుకున్న అక్కడి ఓ భారతీయుడు బాధితుడి గురించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాయడంతో ఈ ఉదాంతం వెలుగు చూసింది. సాధిక్‌ను కాపాడాలంటూ అతడు ఆ లేఖలో పేర్కొన్నాడు.  పూర్తి వివరాలు…పాతబస్తీలోని తలాబ్‌కట్టకు చెందిన సయ్యద్ సాధిక్ (30)కు అర్షద్ అనే ఓ ఏజెంట్ గతేడాది పరిచయం అయ్యాడు.

అతని మాటలు నమ్మిన సాధిక్, అర్షద్‌కు రూ.లక్ష ఇచ్చాడు. దీంతో అతనికి వీసా ఇప్పించి గత ఏడాది జూన్‌లో సాధిక్‌ను సౌదీ అరేబియాకు పంపించాడు. అక్కడ విమానాశ్రయంలో దిగగానే ఓ అరబ్ వ్యక్తి వచ్చి అతన్ని నేరుగా అడవికి తీసుకెళ్లాడు. అక్కడ సుమారు 150 ఒంటెలు ఉన్నాయి. వాటి బాగోగులు చూసుకోవాలని చెప్పడంతో సాధిక్ విస్తూపోయాడు. ఏజెంట్ అర్షద్ చివరకు తనను మోసగించడాన్ని గ్రహించి అక్కడే గడపసాగాడు.

Comments

comments