Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

సెరెనాకు అజెరెంకా షాక్

tennisఇండియన్ వెల్స్ : ఇండియన్స్ వెల్స్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బెలారస్ భామ విక్టోరియా అజెరెంకా ప్రపంచ నెం.1 సెరెనా విలియమ్స్‌కు షాకిచ్చింది. 88 నిమిషాల పాటు సాగిన టైటిల్ పోరులో మాజీ ప్రపంచ నెం.1 అజెరెంకా 6-4, 6-4తో వరుస సెట్లలో సెరెనాను చిత్తుచేసింది. మ్యాచ్‌లో అజెరెంకా బ్యాక్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడడంతో ఒత్తిడికి గురైన సెరెనా ఏకంగా 33 అనవసర తప్పిదాలు, మరో ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. గాయాలతో రెండేళ్లుగా టైటిల్ సాధించడంలో వెనుకబడిన అజెరెంకాకు కెరీర్‌లో ఇది మూడో ఇండియన్స్ వెల్స్ టైటిల్ కాగా, ఓవరాల్‌గా 19వ టైటిల్.
జకో ఐదోసారి : ఇండియన్స్‌వెల్స్ పురుషుల టైటిల్‌ను ప్రపంచ నెం.1 నొవక్ జకోవిచ్ రికార్డు స్థాయిలో ఐదోసారి కైవసం చేసుకున్నాడు. సెమీస్‌లో రాఫెల్ నాడల్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన జకోవిచ్ టైటిల్ పోరులో కెనడా యువ కిషోరం మిలోస్ రోనిక్‌ను 6-2-6-0తో 77 నిమిషాల్లోనే చిత్తు చేశాడు. గత నాలుగు దశాబ్దలలో తక్కువ సమయంలోనే మ్యాచ్‌ను ముగించిన తొలి ఆటగాడు జకోవిచే కావడం విశేషం.

Comments

comments