Home జాతీయ వార్తలు ఆ విజయం నీ బలం అనుకోకు… వాపు!

ఆ విజయం నీ బలం అనుకోకు… వాపు!

peddireddy

హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించినంత మాత్రాన చంద్రబాబు అంతలా గర్వించవద్దని, ‘ఆ విజయం బలం కాదు.. వాపు మాత్రమేనని మరచిపోవద్దు’అని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత పెద్ది రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసిన గెలిచిన చంద్రబాబు ప్రజల అభిమానం సంపాదించి గెలిచామని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్బంగా గెలవలేమని తెలిసి రూ.200కోట్ల డబ్బులు వెదజల్లారని, ఓటుకు రూ.5000 నుండి రూ.10వేల వరకు పంచారని ఆరోపించారు.
పోలీసుతోపాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ను కూడా చంద్రబాబు తన సొంత పార్టీ కార్యకర్తల్లా వాడుకున్నారని అన్నారు. పార్టీ గెలుపుకోసం అధికార దుర్వినియోగం చేసిన విషయం రాష్ట్ర ప్రజలు గమనించారని తెలిపారు. ‘నీ బెదిరింపులకు భయపడి ఓటేశారు తప్పా నీ పాలన చూసి కాదు బాబూ’అంటూ ఘాటుగా విమర్శించారు.

Victory in Nandyala by-election was not with public strength