Search
Wednesday 14 November 2018
  • :
  • :

సింహంలా సింగిల్‌గానే..

ktr

కాంగ్రెస్ వాళ్లలా మూకగా కాదు

ఎవరెలా వచ్చినా Vక్టరీ మనదే
సిరిసిల్లలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ సిరిసిల్ల: సింహం సింగిల్‌గానే వస్తుంది. కాంగ్రెస్ వాళ్ల లా మూకగా కాదు. ఎవరెలా వచ్చి నా మనదే విక్టరీ అని ఐటి, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలో ఎక్క డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో సిఎం కెసిఆర్ సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులు కేటాయించి సరికొత్త చరిత్ర కు నాంది పలికారని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం పదిర, హరిదాస్ నగర్, ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన పలు అభివృధ్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి రూ. 43వేల కోట్లు కేటాయించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 29 లక్షల మందికి రూ.800 కోట్లను మాత్రమే పెన్షన్లుగా అందించారని, తెలంగాణ ఏర్పడిన తరువాత 42 లక్షల మందికి రూ. 5,600 కోట్ల అందిస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృధ్ధి రెండింటిని రెండుకళ్లుగా భావించి రెండు రంగాల్లో కూడా సరికొత్త చరిత్రకు నాంది పలికామన్నారు.పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేశామన్నారు. ఎవరూ అడగక ముందే మధ్యాహ్నభోజనానికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరిట పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థిక సహయం అందిస్తోందన్నారు.పేదింటి ప్రజలు ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు రెండు పడకల ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవించే మహిళలకు కెసిఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. బతుకమ్మ చీరెల ఆర్డర్‌తో నేతన్నలకు చేతినిండా పని లభిస్తోందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎవ్వరూ ఆలోచించని విధంగా రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చి రైతులకు వెన్నుదన్నుగా తమప్రభుత్వం నిలిచిందని మంత్రి చెప్పారు. రైతులకు రూ.17వేలకోట్ల రుణమాఫి చేసిన ఘనత తమదేనన్నారు. ఆగస్ట్ 15 నుండి రైతుబీమా అమల్లోకి అమలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. కంటి వెలుగుతో ఇంటింటిలో కంటి పరీక్షలు నిర్వహించే బృహత్తర పథకం, కులవృత్తులకు ప్రోత్సాహకాలను అందించేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రూ.5వేల కోట్లతో గొర్రెలు, వెయ్యి కోట్లతో చేపల పంపిణీ,రూ. 1270 కోట్లతో చేనేతకు చేయూత కార్యక్రమా లు చేపడుతున్నామన్నారు.నాణ్యమైన విద్యకోసం గురుకులాలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, పాల్గొన్నారు.

Comments

comments