Home తాజా వార్తలు కనీస క్రీడాస్ఫూర్తి మరిచారు…!!

కనీస క్రీడాస్ఫూర్తి మరిచారు…!!

Vidhurbha-teem-player

న్యూఢిల్లీః గెలుపోటములతో సంబంధం లేకుండా గ్రౌండ్ లో ప్రత్యర్థి ప్లేయర్స్‌ను గౌరవించడం జెంటిల్మన్ గేమ్ క్రికెట్‌లో ఆనవాయితీగా వస్తున్న సంప్రాదాయం. ఢిల్లీ రంజీ టీమ్ ప్లేయర్స్ మాత్రం కనీస క్రీడాస్ఫూర్తి మరిచిపోయారు. ఈ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో ఢిల్లీ ప్లేయర్స్ వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. ఢిల్లీ బౌలర్ వేసిన బౌన్సర్ తగిలి విదర్భ బ్యాట్స్‌మన్ క్రీజులోనే కుప్పకూలాడు. మామూలుగా ఇలాంటి సంఘటన జరిగితే పక్క టీమా మన టీమా అన్నది పట్టించుకొకుండా సాటి ప్లేయర్సంతా వచ్చి అతని బాగోగులు చూస్తారు. కానీ ఢిల్లీ ప్లేయర్స్ మాత్రం ఏమీ పట్టనట్లు పక్కకు తప్పుకున్నారు. అతను బాధతో విలవిల్లాడుతున్నా.. చూస్తూ ఎవరిపాటికి వాళ్లు వెళ్లిపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి ఫీల్డ్‌లో ఉన్న అంపైర్లు కూడా ఆ బ్యాట్స్‌మన్‌కు సహయం అందించడానికి ముందుకు రాలేదు. నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ సాయం కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు సిగ్నల్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఏడుసార్లు చాంపియన్ అయిన ఢిల్లీని ఓడించి విదర్భ టీమ్ తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది అభిమానులు… ఢిల్లీ టీమ్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.

https://www.youtube.com/watch?v=ZsgIdcxIkuQ