Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కందుల కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్

meeting

మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కందుల కొనుగోళ్ల పట్ల గురువారం వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి పార్థిసారథి గురువారం జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో ఏ విధంగా రైతుల నుండి కందుల కొనుగోలు చేయడం జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. అలాగే వారంలోపు కందుల కొనుగోలు కేంద్రాలను ముగించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు కందుల కొనుగోళ్లు ఉన్నాయని, 1130 మంది రైతుల దగ్గర 11వేల క్వింటాళ్ల కందులను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రైతులకు డబ్బులు ఇంకా ఇవ్వలేదని, పెండింగ్‌లో ఉన్నాయని, త్వరగా ఇప్పించాలని తెలిపారు. అలాగే 15 రోజుల వరకు కందుల కొనుగోలు చేసే విధంగా అనుమతి ఇవ్వాలన్నారు. ఇంకా 15 రోజుల వరకు గడువు పొడగించబడినందున జిల్లా కేంద్రంలోని రైతులు కొనుగోలు కేంద్రాలకు కందులను త్వరగా తీసుకురావాలని కలెక్టర్ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అలీంఅహ్మద్, జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments