Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో వీడియోగ్రాఫర్ మృతి

రోడ్డు ప్రమాదంలో వీడియోగ్రాఫర్ మృతి

Road Accidentరంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఓ వీడియోగ్రాఫర్ మృతిచెందాడు. ఈ ఘటన శామీర్ పేటలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వీడియోగ్రాఫర్ వట్టపు వినోద్ (23)ను ఎన్నికల తనిఖీలు నిర్వహించేందుకకు ఎన్నికల అధికారులు నియమించుకున్నారు. ఈ క్రమంలో శామీర్ పేట ఒఆర్ఆర్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై ఎన్నికల అధికారులు వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో వినోద్ వీడియో తీస్తున్నాడు. వేగంగా వచ్చిన లారీ వినోద్ ను ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు వినోద్ చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం వినోద్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు శామీర్ పేట పోలీసులు తెలిపారు.

Videographer Dead in Road Accident at Rangareddy