Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఎన్‌టిఆర్ కుటుంబాన్ని కలిసిన విద్యాబాలన్

NTR-Family

బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ బుధవారం ఎన్టీఆర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి పూల బొకేతో ఆమెకు స్వాగతం పలికారు. నందమూరి వంశ ఆచారం ప్రకారం విద్యాబాలన్‌కు చీరను బహూకరించారు. ‘ఎన్.టి.ఆర్.’ బయోపిక్‌లో బసవతారకం పాత్ర పోషించనున్నారు విద్యాబాలన్. ఇక బసవతారకం  వ్యవహారశైలి ఎలా ఉంటుంది, ఆమెకు ఇష్టమైన విషయాలేమిటి, హాబీస్ గురించి ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు విద్యాబాలన్. ఈ ఆత్మీయ పరిచయ తేనేటి విందులో నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర దేవి, ఆయన చిన్న కుమార్తె తేజస్విని, చిన్న అల్లుడు శ్రీభరత్ పాలుపంచుకున్నారు. ఇక విద్యాబాలన్ బుధవారం నుంచి ‘ఎన్.టి.ఆర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. విద్యాబాలన్ ఓ వైవిధ్యమైన గెటప్‌లో కనిపించనున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా… నందమూరి బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నరేష్ వి.కె, మురళీశర్మ, ప్రకాష్‌రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః జ్ఞానశేఖర్, సంగీతంః  ఎం.ఎం.కీరవాణి, మాటలుః సాయిమాధవ్ బుర్రా, పాటలుః సిరివెన్నెల సీతారామశాస్త్రి.

Comments

comments