Home జాతీయ వార్తలు ‘ ఎన్‌టిఆర్’ బయోపిక్‌లో విద్యా బాలన్

‘ ఎన్‌టిఆర్’ బయోపిక్‌లో విద్యా బాలన్

Vidya Balan Act in 'NTR' Biopic

హైదరాబాద్ : క్రిష్ దర్శకత్వంలో మహానటుడు, దివంగత సిఎం ఎన్‌టిఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్‌టిఆర్ పాత్రను ఆయన తనయుడు, నటుడు నందమూరి బాలకృష్ణ పోషిస్తున్నారు. ఎన్‌టిఆర్ సతీమణి బసవతారకం పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్‌టిఆర్ సినిమాలో తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని విద్యాబాలన్ తెలిపారు. ఈ చిత్రంలో ఎన్‌టిఆర్ జీవితంలో బసవతారకం పాత్ర ఎంతో ప్రభావంతంగా ఉంటుందని, అందుకే ఈ పాత్రలో నటించేందుకు అంగీకరించినట్టు విద్యాబాలన్ తెలిపారు. ఇంకా ఈ సినిమాలో అనేక మంది నటీనటులు, రాజకీయ నాయకులు నటిస్తున్నారు. ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడు పాత్రలో రానా దగ్గుబాటి, సూపర్‌స్టార్ కృష్ణ పాత్రలో ప్రిన్స్ మహేశ్‌బాబు, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య తదితరులు నటిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు నటులు మోహన్‌బాబు, డాక్టర్ రాజశేఖర్‌లు కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

Vidya Balan Act in ‘NTR’ Biopic