Home తాజా వార్తలు బసవతారకం లుక్ లో విద్యాబాలన్

బసవతారకం లుక్ లో విద్యాబాలన్

Vidya-Balan

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టి రామారావు జీవితం ఆధారంగా ఎన్టిఆర్ సినిమాను తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తుండగా క్రిష్ దర్శకత్వంలో  రూపుదిద్దుకుంటుంది. ఇప్పటి వరకు సినిమాలోని ముఖ్యపాత్రదారుల లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్టిఆర్  భార్య బసవతారకం లుక్ ఒకటి బయటకొచ్చింది.  బసవతారకం పాత్రంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు.  బసవతారకమ్మలా తయారై అద్దం ముందు కూర్చున్న ఫోటోను తన ఇన్ స్ట్రాగ్రామ్  లో విద్యాబాలన్ పోస్టు చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్,  చంద్రబాబు నాయుడు స్థానంలో దగ్గుబాటి రానా, అక్కినేని నాగేశ్వర్ రావుగా సుమంత్, శ్రీదేవీగా రకూల్ ప్రీతి సింగ్ నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నారు. ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌ ను టూ పార్ట్స్ గా విడుదల చేస్తున్నారు. 2019 జనవరి 9న ‘కథానాయకుడు’, జనవరి 24 ‘మహానాయకుడు’గా విడుదల చేస్తున్నట్టు సమాచారం.

Vidya Balan on playing NTR’s wife in biopic

Telangana news