Home తాజా వార్తలు పింక్ తమిళ్ రీమేక్‌లో…

పింక్ తమిళ్ రీమేక్‌లో…

బాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్ ‘ఎన్టీఆర్’ బయోపిక్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లోకి ప్రవేశించాక ఆమె తెలుగు వారి అభిమానాన్ని విశేషంగా చూరగొంది. ఎన్టీఆర్ బయోపిక్‌తో విద్యాబాలన్ టాలెంట్ అందరికీ అర్ధమైపోయింది. దాంతో ఆమెను తెలుగులో మరిన్ని సినిమాల్లో చూడాలనుకుంటున్నారు. కానీ ప్రాధాన్యత ఉన్న పాత్రలు అయితేనే ఆమె చేయాలనుకుంటోంది. ఇదిలాఉండగా తమిళంలోనూ విద్యాబాలన్ ఓ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌లో తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పింక్’కి తమిళ రీమేక్ ఇది. ‘నేర్కొండ పార్వై’ అనే ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్నారు. అజిత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో సౌత్‌లో విద్యాబాలన్ మరిన్ని వరుస అవకాశాలు దక్కించుకోవడం ఖాయమంటున్నాయి సౌత్ ఫిలిం వర్గాలు.

Vidya balan to act in Pink Tamil remake