Home సినిమా కోటి వ్యూస్‌కు చేరువలో…

కోటి వ్యూస్‌కు చేరువలో…

vijayసౌతిండియాలో తమిళ్ హీరోలకున్న క్రేజే వేరు. ఫాలోయింగ్ విషయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రమే కాదు… విజయ్, అజిత్‌లు కూడా తక్కువేమీ కాదు. వాళ్ల సినిమాలు రిలీజైనప్పుడు ఉండే సందడే అందుకు నిదర్శనం. మూడు నెలల క్రితం అజిత్ మూవీ ‘వేదాలం’ ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు విజయ్ కొత్త సినిమా ‘తెరి’ విషయంలో అంతకంటే ఎక్కువ హైపే ఉంది. విజయ్ మానియా ఏ స్థాయిలో ఉందటే ‘తెరి’ ఫస్ట్ టీజర్ కేవలం రెండు వారాల్లో 80 లక్షలకు పైగా హిట్లు సంపాదించుకుంది. తొలిరోజే పది లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకున్న ఈ టీజర్… వరుసగా సౌతిండియన్ సినిమాల యూట్యూబ్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ వెళ్తోంది. ఈ స్పీడు చూస్తుంటే నెల రోజులలోపే కోటి వ్యూస్ మార్కును దాటేసేలా ఉంది. ‘రాజా రాణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అత్లీ తీస్తున్న రెండో సినిమా ఇది. విజయ్ పోలీస్ అవతారంలో కనిపిస్తున్నాడు. సమంత, అమీజాక్సన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.